ఎరుపు రంగు డ్రెస్ లో మెరిసిపోతున్న బుట్ట బొమ్మ.. కెరీర్ ఎలా ఉందంటే?
పలువురు స్టార్స్ సోషల్ మీడియా ఖాతాలలో అద్భుతమైన లుక్‌లతో ఆకట్టుకుంటూ ఉంటారు. ఇటీవల నటి పూజా హెగ్డే సాంప్రదాయ దుస్తులతో మన దృష్టిని ఆకర్షించింది
పూజా హెగ్డే ఎరుపు రంగు లెహంగాలో పెట్టిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల పూజ కుటుంబంలో పలు శుభకార్యాలు జరిగాయి
ఈ ఎరుపు లెహంగా 'అర్పితా మెహతా' సృష్టిలో భాగం. ఈ లెహంగా సెట్ ధర రూ. 5,60,000. అద్భుతమైన హస్తకళతో ఈ లెహంగాను రూపొందించారు. ఆ లెహంగాకు పూజా మరింత అందాన్ని తీసుకుని వచ్చింది
పూజా హెగ్డే తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటించింది. ఆమె తమిళ చిత్రం ముగమూడి (2012)తో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.
ఒక లైలా కోసం (2014) సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆమె బాలీవుడ్ అరంగేట్రం మొహెంజో దారో (2016)లో హృతిక్ రోషన్ సరసన నటించింది
తెలుగులో స్టార్ హీరోలతోనూ, స్టార్ డైరెక్టర్స్ తోనూ పూజా పని చేసింది. తెలుగులో భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది పూజా హెగ్డే
టాలీవుడ్ లో DJ, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో వంటి వరుస హిట్‌లను అందుకుంది. అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా నిలిచింది
అయితే, పూజా హెగ్డేకి 2022, 2023 సంవత్సరాల్లో నటిగా పెద్దగా కలిసి రాలేదు. గత రెండేళ్లలో ఆమె నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఫ్లాప్ లుగా నిలిచాయి
ఇక పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఆమె స్థానంలో శ్రీలీలని తీసుకున్నారు
మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారంలో కూడా శ్రీలీలకి అవకాశం దక్కింది