రాజశేఖర్ 'కల్కి' సినిమా ఎందుకు ట్రెండ్ అవుతోందో తెలుసా?

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి
కల్కి 2898 AD యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయి. అనేక షోలు క్షణాల్లోనే హౌస్ ఫుల్ అయ్యాయి
ఇక ప్రమోషన్స్ భారీగా చేయడం లేదనే విమర్శలు ఎదుర్కొంటూ ఉండగా.. ఎట్టకేలకు మేకర్స్ ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంక దత్‌లతో కూడిన ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేశారు
ఎవరూ ఊహించని విధంగా ప్రస్తుతం 2019లో రాజశేఖర్ హీరోగా విడుదలైన కల్కి సినిమా గురించి చర్చ జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల కింద విడుదలైన సినిమా గురించి ఎందుకు చర్చ అని అనుకుంటూ ఉన్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి
హైదరాబాద్‌లో కల్కి 2898 AD సినిమా టికెట్ల బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా టిక్కెట్‌లు 2D, 3D ఫార్మాట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం బుక్ మై షోలో భారీగా టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి
రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి (2019) టిక్కెట్లు కూడా ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లో అమ్ముడవుతూ ఉండడంతో పెద్ద గందరగోళం ఏర్పడింది. చాలా మంది ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన కల్కి టిక్కెట్‌లను బుక్ చేసుకున్నారు
బుకింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ కల్కి గురించి కాకుండా రాజశేఖర్ కల్కి చిత్రం కోసం టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. నిమిషాల వ్యవధిలోనే రాజశేఖర్ సినిమా చాలా షోలు హౌస్ ఫుల్ అయ్యాయి
అయితే ఈ గందరగోళానికి తెరపడేలా బుక్ మై షో క్లారిటీ ఇచ్చింది. సాంకేతిక లోపం కారణంగా రాజశేఖర్ కల్కి ఫోటో టికెట్ విక్రయ వేదికపై కనిపించింది. కల్కి టిక్కెట్‌లను కొనుగోలు చేసిన వారందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కల్కి 2898 ADకి మాత్రమే బుకింగ్‌లు అయినట్లు తెలిపింది