ఎరుపు రంగు డ్రెస్సుల్లో మెరుపులు మెరిపించిన తమన్నా, శ్రద్ధా కపూర్

బాలీవుడ్ లో మంచి హైప్ ఉన్న సినిమాల్లో 'స్త్రీ-2' సినిమా ఒకటి. ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీసుకు మాంచి కళ తీసుకుని వస్తుందని ఆశిస్తూ ఉన్నారు
ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు హీరోగా నటించగా.. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాలో తమన్నా భాటియా కూడా తళుక్కుమంటోంది
తమన్నా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించడమే కాకుండా.. ఓ కీ రోల్ కూడా చేసింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లో తమన్నా కనిపించింది
ఆమెపై 'ఆజ్ కీ రాత్' సాంగ్ ను చిత్రీకరించారు. ముంబైలో జరిగిన 'ఆజ్ కీ రాత్' సాంగ్ లాంచ్ కార్యక్రమానికి తమన్నా భాటియా, శ్రద్ధా కపూర్ హాజరయ్యారు
వీరిద్దరూ ఎరుపు రంగు దుస్తులలో కనిపించారు. లాంచ్‌కు హాజరైన తమన్నా భాటియా ఎర్రటి చీరలో కార్సెట్ టాప్ ధరించింది
శ్రద్ధ కూడా రెడ్ కలర్ డ్రెస్ లో కనిపించింది. ఎరుపు రంగు అనార్కలీ సూట్ ధరించి శ్రద్ధా సాంగ్ రిలీజ్ ఈవెంట్ కు హాజరైంది
ఇక సోషల్ మీడియాలో 'ఆజ్ కీ రాత్' సాంగ్ డ్యాన్స్‌పై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు
తమన్నా స్క్రీన్ ప్రెజెన్స్ ను కొందరు ప్రశంసించగా, మరికొందరు దీనిని 'స్త్రీ'మొదటి భాగంలోని నోరా ఫతేహి 'కమరియా'తో పోల్చారు
స్త్రీ 2 సినిమా అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన హారర్-కామెడీ 'స్త్రీ' కి సీక్వెల్. ఈ సినిమా ఆగస్టు 15, 2024న విడుదల కానుంది