భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ లో ఫైనల్ కు చేరింది. న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ టోర్నీలో వరసుగా పదో విజయాన్ని నమోదు చేసింది.

విరాట్ కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ గా నిలిచాడు. 50 సెంచరీలు బాది సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు
ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డును నమోదు చేశాడు. అంతకు ముందు సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న 673 పరుగుల రికార్డును అధిగమించాడు కోహ్లీ
విరాట్ ఈ ఏడాది ప్రపంచ కప్ లో 10 మ్యాచ్ లలో 711 పరుగులు చేశాడు. ఫైనల్ లో ఎంత చేస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు
మొహమ్మద్ షమీ.. భారత్ తరపున ప్రపంచ కప్ లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. అలాగే వన్డేల్లో భారత్ తరపున బెస్ట్ బౌలింగ్ గణాంకాలు కూడా షమీ పేరు మీదనే ఉన్నాయి. ఈ మ్యాచ్ లో 57 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు షమీ. అంతకు ముందు స్టువర్ట్ బిన్నీ 6 వికెట్లు బంగ్లాదేశ్ మీద తీశాడు.
ప్రపంచ కప్ ఎడిషన్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా షమీ నిలిచాడు. జహీర్ ఖాన్ 2011 ప్రపంచ కప్ లో 21 వికెట్లు తీయగా.. షమీ ఈ ప్రపంచ కప్ లో ఇప్పటికే 23 వికెట్లు తీశాడు
ప్రపంచ కప్ లో అత్యధికసార్లు 5 వికెట్లు తీసిన బౌలర్ గా షమీ నిలిచాడు. నాలుగు సార్లు 5 వికెట్లు తీసి.. సరికొత్త రికార్డును అందుకున్నాడు షమీ. మిచెల్ స్టార్క్ పేరు మీదున్న రికార్డును దాటాడు షమీ
వరల్డ్ కప్ లో వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా షమీ నిలిచాడు. 17 మ్యాచ్ లలో షమీ 50 వికెట్లను కొల్లగొట్టాడు
రోహిత్ శర్మ సిక్సర్లతో సరికొత్త రికార్డును అందుకున్నాడు. వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ 51 సిక్సర్లు కొట్టాడు. క్రిస్ గేల్ పేరు మీద ఉన్న రికార్డును రోహిత్ తుడిచిపెట్టాడు
ప్రపంచ కప్ సింగిల్ ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా నిలిచాడు రోహిత్ శర్మ. 2023 లో రోహిత్ 28 సిక్సర్లు కొట్టాడు
ప్రపంచ కప్ లో ఒకే ఇన్నింగ్స్ లో ఎక్కువ సిక్సర్లు బాదిన భారత బ్యాటర్ గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. అయ్యర్ ఏకంగా 8 సిక్సర్లు కొట్టాడు
ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. 397/4 భారత్ చేసినదే బెస్ట్ గా నిలిచింది