భారీగా ఉద్యోగాల కోత.. ఏయే కంపెనీలు షాకిచ్చాయంటే!

టెక్ ఇండస్ట్రీలో ప్రముఖ కంపెనీలు ఉద్యోగులకు వరుస షాక్ లు ఇస్తున్నాయి. టెక్ పరిశ్రమలో 2024లో ఉద్యోగాల కోతలు నెమ్మదించే పరిస్థితి కనిపించడం లేదు
2022-2023లో టెక్ కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించడానికి పూనుకున్నాయి. అప్పటి నుండి టెక్నాలజీ రంగంలో పలు సంస్థలు తమ ఉద్యోగులకు గుడ్ బై చెబుతున్నాయి
తొలగింపులను ట్రాకింగ్ చేసే సంస్థ Layoffs.fyi ప్రకారం, ఆగస్టు 30, 2024 నాటికి.. 422 టెక్ కంపెనీలు 136,782 మంది ఉద్యోగులను తొలగించాయి
ఉద్యోగాల నుండి తొలగింపులు చేపట్టింది కేవలం చిన్న సంస్థలే కాదు, ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద టెక్ దిగ్గజాలు కూడా ఉన్నాయి
గత సంవత్సరం భారీగా తొలగింపులు ఉంటాయని ప్రకటించిన తర్వాత.. ఈ సంవత్సరం కూడా ఆ సంస్థ ఉద్యోగుల హెడ్‌కౌంట్లను తగ్గించడం కొనసాగించాయి
ఈ కంపెనీలు ఖర్చు తగ్గించే చర్యలు, సంస్థల పునర్నిర్మాణ ప్రయత్నాలు, కృత్రిమ మేధస్సు (AI) వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి
ఆపిల్ తన డిజిటల్ సర్వీసెస్ గ్రూప్ లో దాదాపు 100 మంది ఉద్యోగులను తీసివేసింది. మేలో యాపిల్ కాలిఫోర్నియాలో 614 మంది ఉద్యోగులను తొలగించింది. దీర్ఘకాలంగా నడుస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ప్రాజెక్ట్‌ను మూసివేసింది
నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో తన వ్యాపారాన్ని పునర్నిర్మించే లక్ష్యంలో భాగంగా.. ఫిబ్రవరి 2024లోనే 4,000 మంది ఉద్యోగులను తొలగించింది
చిప్‌మేకర్ ఇంటెల్ ఏకంగా 15,000 మంది ఉద్యోగులను తగ్గించింది. కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 15 శాతానికి సమానం
మైక్రోసాఫ్ట్ 2024లో ఉద్యోగాల తొలగింపు ధోరణిని కొనసాగించింది. జనవరిలో, యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను కొనుగోలు చేసిన తర్వాత కంపెనీ తన గేమింగ్ యూనిట్ నుండి 2,000 మంది ఉద్యోగులను తొలగించింది
Google మాతృ సంస్థ ఆల్ఫాబెట్. ఈ సంవత్సరం పలువురిని ఉద్యోగాల నుండి తొలగించింది. వివిధ యూనిట్ల నుండి 630 మంది ఉద్యోగులను తగ్గించింది. ఏప్రిల్‌లో, ఆల్ఫాబెట్ అనేక మంది సీనియర్-స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు కూడా షాక్ ఇచ్చింది. ప్రధాన బృందాల నుండి దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది