గుమ్మడికాయలోనూ బీటా కెరొటిన్‌ ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసే ఇది ఒంట్లోకి చేరుకున్నాక విటమిన్‌ ఎ రూపంలోకి మారిపోతుంది.

అరకప్పు గుమ్మడి ముక్కలతోనే మనకు రోజుకు అవసరమైన విటమిన్‌ ఎ లభిస్తుంది. కళ్లు బాగా కనబడటానికి, పునరుత్పత్తి అవయవాలు సజావుగా పనిచేయటానికి విటమిన్‌ ఎ చాలా అవసరం
గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి కీలక అవయవాల ఆరోగ్యానికి ఇది దోహదం చేస్తుంది. కొన్నిరకాల క్యాన్సర్ల ముప్పు తగ్గటానికీ విటమిన్‌ ఎ తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి
నారింజ రంగులో నిగనిగలాడే గుమ్మడి ముక్కల్లోని పొటాషియం రక్తపోటు తగ్గటంలోనూ సాయపడుతుంది. ఫలితంగా పక్షవాతం ముప్పూ తగ్గుముఖం పడుతుంది
గుమ్మడికాయ గింజల్లో ప్రోటీన్లు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాల గొప్ప మూలం, ఇది అనేక తీవ్రమైన వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది
గుమ్మడికాయ గింజలను ఉదయం ఖాళీ కడుపుతో, సాయంత్రం అల్పాహారంగా తినవచ్చు
గుమ్మడి గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీన్ని తినడం వల్ల శరీరంలో ఎలాంటి వాపునైనా తగ్గించుకోవచ్చు
గుమ్మడికాయ గింజల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని కణాల సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తాయి
గుమ్మడి గింజల్లో అధిక మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
గుమ్మడిలో పీచు ఎక్కువ. కేలరీలు తక్కువ. ఇలా ఇది త్వరగా ఆకలి వేయకుండా, బరువు పెరగకుండా చూస్తుంది
గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరటోనిన్‌ అనే రసాయనం ఉత్పత్తి కావటానికి తోడ్పడుతుంది
బీటా కెరొటిన్‌తో పాటు విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, ఐరన్‌, ఫోలేట్‌ కూడా గుమ్మడిలో ఎక్కువే. ఇవన్నీ రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి