భారతదేశంలో ఉపయోగించే గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు కూడా ఒకటి
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేసిన ఆధార్ కార్డుకు12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది
ఇది తెలుపు రంగులో ఉంటుంది. అయితే 2018లో కేంద్రప్రభుత్వం బ్లూ ఆధార్ కార్డులను ప్రవేశ పెట్టింది
కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లల కోసం బాల్ ఆధార్ కార్డు అని పిలిచే బ్లూ ఆధార్ కార్డులను తీసుకుని వచ్చింది
ఈ బ్లూ ఆధార్ కార్డులో కూడా 12 అంకెలు ఉంటాయి. అయితే చిన్నారుల వయస్సు 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది చెల్లదు
ఆధార్ కార్డ్‌లో కార్డుహోల్డర్ వేలిముద్రలు, రెటీనా వివరాలు కూడా ఉంటాయి. బ్లూ బాల్ ఆధార్ కార్డ్‌లో అలాంటి సమాచారం ఏదీ ఉండదు. ప్రత్యేక సంఖ్య కూడా ఉండదు
పిల్లలు పెరిగి 5 ఏళ్లు దాటిన తర్వాత వివరాలను అప్‌డేట్ చేయాలి. వేలిముద్రలను యూఐడీఏఐకి ఇవ్వాలి. యూఐడీఏఐ ఈ కార్డును పాఠశాలల్లో అడ్మిషన్ సమయంలో డాక్యుమెంట్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు
అవసరమైన డాక్యుమెంట్లతోపాటు సమీపంలోని ఆధార్ కార్డు నమోదు కేంద్రానికి వెళ్లాలి. అడ్రస్ ప్రూఫ్, చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ తీసుకు వెళ్లి దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
సర్టిఫికెట్లను ఇవ్వడమే కాకుండా.. తల్లిదండ్రులు తమ సొంత ఆధార్ సమాచారాన్ని అందించాలి
బ్లూ బాల్ ఆధార్ కార్డ్ కోసం మొబైల్ నంబర్లను కూడా ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ కేంద్రంలో చిన్నారుల ఫోటోను తీస్తారు. ఈ ఫోటో ఆధార్ కార్డుపై ఉంటుంది. వెరిఫికేషన్ జరిగిన 60 రోజులలోపు బాల్ ఆధార్ కార్డ్ వస్తుంది