Sun Dec 22 2024 15:47:36 GMT+0000 (Coordinated Universal Time)
Women's Day : ఈ గిఫ్టులతో మగువలను సర్ ప్రైజ్ చేయండి
అమ్మ, అక్క, చెల్లి, భార్య ఇలా ఎవరో ఒకరు కీలక పాత్ర పోషించి ఉంటారు. అలా మీ జీవితంలో ఉన్న ముఖ్యమైన వారికి ..
ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ప్రపంచం మొత్తం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది 112వ మహిళా దినోత్సవాన్ని జరుపుకునేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 1975లో అధికారికంగా గుర్తించి.. అప్పటి నుంచి మహిళా దినోత్సవాన్ని జరుపుతూ వస్తోంది. 1996 నుంచి ఐరాస ఆధ్వర్యంలో ఏడాదికొక ఇతివృత్తంతో మహిళల దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. సమాజంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది.
ఒక 50-60 ఏళ్ల క్రితం వరకూ వంటింటికే పరిమితమైన మహిళలు.. ఈరోజు ప్రపంచస్థాయిలో తమకు సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, వ్యవసాయం ఇలా ప్రతిరంగంలోనూ తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక ముఖ్యమైన మహిళ ఉంటుంది. అమ్మ, అక్క, చెల్లి, భార్య ఇలా ఎవరో ఒకరు కీలక పాత్ర పోషించి ఉంటారు. అలా మీ జీవితంలో ఉన్న ముఖ్యమైన వారికి ఈ ఉమెన్స్ డే కి ఎలాంటి గిఫ్టులివ్వాలని ఆలోచిస్తున్నారా. అయితే వీటిపై ఓ లుక్కేయండి.
1. చాలామంది ఆడవాళ్లకు పుస్తక పఠనం అలవాటు ఉంటుంది. మీ జీవితంలో ఉన్న వారికి కూడా ఈ అలవాటు ఉంటే మంచి పుస్తకాన్ని గిఫ్టుగా ఇవ్వండి. నవల, కామెడీ, ఆధ్యాత్మికం, కళ, సాహిత్యం, ఇలా ఏ పుస్తకాన్నైనా ఇవ్వొచ్చు. వారికి జీవితాంతం గుర్తుండి పోయే మంచి గిఫ్టు ఇది.
2. స్మార్ట్ ఫోన్. ఇంటిల్లిపాదికీ పనులు చేస్తూ.. బయటి ప్రపంచం తెలియని మహిళలు ఇంకా ఉన్నారు. అలాంటి వారికి స్మార్ట్ ఫోన్ ను బహుకరించండి. వారి ముఖం ఆనందంతో వెల్లివిరుస్తుంది.
3. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు.. ఏడాదిలో పుట్టినరోజు, పెళ్లి రోజు.. ఇదిగో ఇలా మహిళల దినోత్సవం రోజున.. తమకి బహుమతులు ఇస్తారని ఎదురుచూస్తుంటారు. పైకి చెప్పలేకపోయినా.. వారిమనసులో కోరిక ఉంటుంది. అమ్మ, భార్య, సోదరి.. ఇలా ఉన్నవారికి సర్ ప్రైజింగ్ గా అందమైన చీరను బహుకరిస్తే.. దానిని చూసి మురిసిపోతారు. ఖరీదైన బహుమతులకంటే.. ఇలాంటి బహుమతులతోనే వారు మరింత ఆనంద పడతారనడంలో సందేహం లేదు.
4.స్కూల్ లేదా కాలేజీలకు వెళ్లే సోదరీమణులుంటే.. చేతి వాచీలను గిఫ్టులుగా ఇవ్వడం మంచిది. సమయం చాలా విలువైనది అంటారు కదా. అలా మీరిచ్చిన వాచీని తమ చేతికి చూసుకున్నప్పుడల్లా మీరే గుర్తొస్తారు. మా నాన్న/ సోదరుడు నాకీ బహుమతి ఇచ్చాడని తెగ సంబరపడతారు.
5. ఈ ఉమెన్స్ డే కి ప్రియురాలికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా. కొంచెం బడ్జెట్ ఉంటే ఒక గోల్డ్ రింగ్. లేకపోతే.. తను మీకెంత స్పెషలో చెప్పేలా ఒక గ్రీటింగ్ కార్డ్, Teddy Bearను బహుకరించండి.
6. మొక్కలు. మగువల్లో మొక్కల ప్రేమికులు చాలామంది ఉంటారు. గార్డెనింగ్ ఇష్టపడే ఆడవాళ్లెందరో ఉంటారు. అలాంటి వారికి పువ్వులు లేదా పండ్ల మొక్కలను బహుమతిగా ఇవ్వండి. నిజానికి మొక్కను చూడగానే మైండ్ రీ ఫ్రెష్ అవుతుంది. ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.
7.మేకప్ ఐటమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ మొదలైన వాటిని కూడా హ్యాంపర్ లో మిక్స్ చేసి మహిళా దినోత్సవం సందర్భంగా గిఫ్ట్ గా ఇస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు.
Next Story