Sun Dec 22 2024 15:36:18 GMT+0000 (Coordinated Universal Time)
Women's Day : 27 ఏళ్లుగా వివిధ రకాల థీమ్ లతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. మరి ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా !
1996లో గతమును గుర్తించుట, భవిష్యత్తుకు ప్రణాళిక రచించుట, 1997లో మహిళలు, శాంతి టేబుల్, 1998లో మహిళలు, మానవ హక్కులు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతిఏడాది మార్చి 8వ తేదీన జరుపుకుంటాం. ఈ రోజున మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు సెలవు ఇస్తారు. ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలను ప్రత్యేకంగా సన్మానిస్తారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. 1975 నుంచి ఐక్య రాజ్య సమితి అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతోంది. 2011లో 100వ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించిన ఐక్యరాజ్యసమితి.. 1996 నుంచే ఏడాదికొక ఇతివృత్తం (థీమ్)తో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది.
1996 నుంచి 2009 వరకు..
1996లో గతమును గుర్తించుట, భవిష్యత్తుకు ప్రణాళిక రచించుట, 1997లో మహిళలు, శాంతి టేబుల్, 1998లో మహిళలు, మానవ హక్కులు, 1999లో మహిళలపై హింసలేని ప్రపంచం, 2000 సంవత్సరంలో శాంతి కొరకు మహిళలను సమన్వయపరచుట, 2001లో మహిళలు, శాంతి: మహిళలు పోరాటాలను నిర్వహించుట, 2002లో నేటి ఆప్ఘన్ మహిళ : నిజాలు, అవకాశాలు, 2003లో లింగ సమానత్వం, లింగ సమానత్వం, సహస్రాబ్దపు అభివృధ్ధి లక్ష్యాలు, 2004లో మహిళలు, హెచ్.ఐ.వి / ఎయిడ్స్, 2005లో తరువాత లింగ సమానత; అతి భద్రమైన భవిష్యత్తును నిర్మించుట, 2006లో నిర్ణయాలు తీసుకొనుటలో మహిళలు, 2007లో మహిళలు, బాలికలపై హింసకు శిక్షను తప్పించుకొనలేకుండా చేయుట, 2008లో మహిళలు, అమ్మాయిలు ఇన్వెస్టింగ్, 2009లో మహిళలు, పురుషులు యునైటెడ్ మహిళలు, అమ్మాయిలు హింసకు వ్యతిరేకంగా ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను నిర్వహించింది.
2010 నుంచి 2022 వరకు..
2010లో సమాన హక్కులు, సమాన అవకాశాలు: అన్ని కోసం ప్రోగ్రెస్, 2011లో మహిళలు మంచి పని చేయడానికి మార్గం: సమాన విద్య, శిక్షణ,, సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్సెస్, 2012లో గ్రామీణ మహిళా సాధికారత, పేదరికం, ఆకలి నిర్మూలన, 2013లో ఒక వాగ్దానం వాగ్దానమే: మహిళలపై వయోలెన్స్ నిర్మూలన యాక్షన్ కోసం సమయం, 2014లో మహిళల సమానత్వం అన్నింటి కోసం పురోగతి, 2015లో మహిళలను శక్తివంతం చేయడం, మానవత్వాన్ని శక్తివంతం చేయడం: చిత్రించండి. 2016లో 2030 నాటికి గ్రహం 50-50: లింగ సమానత్వం కోసం స్టెప్ ఇట్ అప్, 2017లో మారుతున్న పని ప్రపంచంలో మహిళలు: 2030 నాటికి ప్లానెట్ 50-50, 2018లో ప్రస్తుత సమయం: గ్రామీణ, పట్టణ కార్యకర్తలు మహిళల జీవితాలను మారుస్తున్నారు, 2019లో సమానంగా ఆలోచించండి, నేర్పుతో నిర్మించండి, మార్పు కోసం కొత్త కల్పనలు చేయండి. 2020లో "నేను పురుషానుక్రమముతో సమానత్వం: మహిళల హక్కులను గ్రహించడం", 2021లో నాయకత్వంలోని మహిళలు:కోవిడ్ - 19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం, 2022లో లింగ సమాన ప్రపంచాన్ని ఊహించుకోండి వంటి ఇతివృత్తాలతో (థీమ్) ఐక్య రాజ్యసమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను నిర్వహించింది.
అదేమాదిరి ఈ ఏడాది కూడా ఒక కొత్త థీమ్ తో వేడుకలకు ఐరాస సిద్ధమైంది. అదే #EmbraceEquity థీమ్. అంటే ఈక్విటీని ఆలింగనం చేసుకోవడం. ఈక్విటీని ఆలింగనం చేసుకోవడం అంటే మనలో ప్రతి ఒక్కరూ ఏమి సాధించగలరనే ముందస్తు ఆలోచనల ద్వారా ప్రభావితం కాకుండా వ్యక్తులను మరియు వారి సహకారాన్ని విలువైనదిగా పరిగణించడం. చెప్పింది వినడం మాత్రమే కాకుండా వారి సూచనలు, వారి దృక్కోణాలు, వారి ఆలోచనలకు ప్రతిస్పందించడం.
Next Story