Mon Dec 23 2024 13:14:06 GMT+0000 (Coordinated Universal Time)
లక్ష్య సేన్ కు షాకిచ్చిన ప్రణోయ్
భారత్ కు చెందిన హెచ్.ఎస్.ప్రణోయ్ కామన్ వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ ను ఓడించాడు.
భారత్ కు చెందిన హెచ్.ఎస్.ప్రణోయ్ కామన్ వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ ను ఓడించాడు. ఇద్దరు భారతీయుల మధ్య సాగిన పోరు ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఫస్ట్ గేమ్ లో లక్ష్య సేన్ బాగా ఆడగా.. ఆ తర్వాత ప్రణోయ్ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. దీంతో ప్రణోయ్ లక్ష్య సేన్‌ని ఓడించి సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. లక్ష్య సేన్, ప్రణోయ్ మధ్య ఒక గంటా 15 నిమిషాల పాటు సాగింది. ఈ పోరులో 17-21, 21-16, 21-17 తేడాతో ప్రణోయ్ విజయాన్ని అందుకున్నాడు. ఈ ఇద్దరు భారతీయులు తలపడడం నాలుగో సారి. హెడ్-టు-హెడ్ రికార్డు 2-2తో సమం అయింది. ప్రణోయ్ క్వార్టర్స్‌లో చైనాకు చెందిన జావో జున్ పెంగ్‌తో తలపడనున్నాడు.
భారత పురుషుల డబుల్స్ జంటలు ధృవ్ కపిల- MR అర్జున్, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి జోడి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో డానిష్ జంట జెప్పీ బే, లాస్సే మోల్హెడేను 21-12, 21-10 తేడాతో ఓడించింది. సాత్విక్ ,చిరాగ్ జంట గ్వాటెమాలన్ జంటను ఓడించి ప్రీ-క్వార్టర్ఫైనల్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జపాన్ ద్వయం టకురో హోకి, యుగో కొబయాషితో క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ , చిరాగ్ జోడీ తలపడనుంది. భారత షట్లర్లు ధ్రువ్ కపిల- ఎం.ఆర్ అర్జున్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్ఫైనల్లో హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ జంటను ఓడించి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది.
Next Story