Fri Nov 15 2024 01:23:42 GMT+0000 (Coordinated Universal Time)
కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ సాధించినట్లుగానే.. ఇక్కడ కూడా సత్తా చాటేరా..?
కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ సాధించినట్లుగానే.. ఇక్కడ కూడా
పురుషుల సింగిల్స్‌లోనే కాకుండా.. పురుషుల డబుల్స్ బృందం కూడా ఈ టోర్నీలో పతకాలపై ఆశలు పెట్టుకుంది. భారత బృందంలో నలుగురు పురుషుల జోడీలను కలిగి ఉంది. కామన్వెల్త్ బంగారు పతక విజేత సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి/చిరాగ్ శెట్టి, మను అత్రి/బి. సుమీత్ రెడ్డి, కృష్ణ ప్రసాద్ గరగ/విష్ణువర్ధన్ గౌడ్ పంజుల, M R అర్జున్/ధృవ్ కపిల జోడీలు పతకాలపై ఆశలు పెట్టుకున్నాయి. భారత జట్టులో నాలుగు మహిళల జోడీలు కూడా లైనప్‌లో ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జంట ట్రీసా జాలీ / గాయత్రి గోపీచంద్‌పై పతక అంచనాలు ఉన్నాయి. అపారమైన అనుభవం ఉన్న అశ్విని పొనప్ప/ఎన్ సిక్కి రెడ్డి, పూజా దండు/సంజన సంతోష్, అశ్విని భట్/శిఖా గౌతమ్‌లు కూడా టాప్ ఆటగాళ్లకు షాక్ ఇవ్వగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లకు గట్టి సవాల్‌ను విసరానున్నారు.
మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో భారత్ తరపున రెండు జోడీలు యాక్షన్‌లో కనిపించనున్నారు. ఇషాన్ భట్నాగర్-తనీషా క్రాస్టో, వెంకట్ గౌరవ్ ప్రసాద్ మరియు జూహీ దేవాంగన్ జంట BWF ప్రపంచ ఛాంపియన్షిప్ వేదికపై తమ టాలెంట్ ను నిరూపించుకోనున్నారు. భారత్ తమ మంచి ఫామ్‌ను సద్వినియోగం చేసుకుని టోర్నీలో తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. సింధు టోర్నమెంట్ నుండి వైదొలగడం భారత్ టైటిల్ అంచనాలను దెబ్బతీసింది. మిగిలిన ఇతర ఏస్ భారత షట్లర్లు ఖచ్చితంగా తమ నైపుణ్యాలను ప్రదర్శించి, ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ 2022లో భారతదేశానికి పతకాల సంఖ్యను పెంచుతారని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉన్నారు.
Next Story