Mon Dec 23 2024 12:01:41 GMT+0000 (Coordinated Universal Time)
భారీ స్కోరు.. బాగా ఆడితేనే
ఆఫ్ఘనిస్తాన్ బాగానే ఆడింది. బ్యాటర్లు భారీ స్కోరునే భారత్ ముందుంచారు. యాభై ఓవర్లకు 272 పరుగులు చేశారు
ఆఫ్ఘనిస్తాన్ బాగానే ఆడింది. బ్యాటర్లు భారీ స్కోరునే భారత్ ముందుంచారు. యాభై ఓవర్లకు 272 పరుగులు చేశారు. ఇండియా ముందు ఉంచిన టార్గెట్ చిన్నదేమీ కాదు. బ్యాటర్లు సక్సెస్ అయ్యారు. నలభై ఐదు ఓవర్ల వరకూ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆప్ఘనిస్తాన్ తర్వాత వరసగా వికెట్లను కోల్పోవడంతో ఆ మాత్రం స్కోరుకైనా టీం ఇండియా కొంత కట్టడి చేయగలిగింది. తొలుత టాస్ గెలిచిన ఆప్ఘనిస్థాన్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. తొలి స్పెల్్లోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆప్ఘనిస్తాన్ తర్వాత నిలదొక్కుకుంది. ఢిల్లీ మైదానం మరోసారి బ్యాటర్లకు స్వర్గధామం అని నిరూపించింది.
చివరిలో వికెట్లు...
బుమ్రా అత్యధికంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. హార్ధిక్ పాండ్యా రెండు, కులదీప్ యాదవ్ ఒకటి, ఠాకూర్ మరొో వికెట్ తీసుకున్నాడు. దీంతో ఆప్ఘనిస్తాన్ను 272 పరుగులకే కట్టడి చేయగలిగారు. ఇక భారత్ ముందున్న లక్ష్యం 273. పెద్ద టార్గెట్ ఏమీ కాకపోయినా ఓపెనర్లు నిలదొక్కుకోగలిగితేనే ఫలితం సానుకూలంగా వస్తుంది. లేకుంటే చేతులెత్తే పరిస్థితి రావచ్చు. హస్మత్ 80 అజ్మత్ 62 పరుగులు చేసి ఆప్ఘనిస్తాన్ ను ఆదుకున్నారు. మరి టీం ఇండియా బ్యాటర్లు ఏం చేస్తారన్నది చూడాలి.
Next Story