Mon Dec 23 2024 12:05:05 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : శ్రీలంక మాదిరిగానే సౌతాఫ్రికా... దానికి కారణం జడేజాయే కదా
వరల్డ్కప్ లో వరస టీం ఇండియా వరస విజయాలకు బ్యాటర్లు ఎంత కారణమో.. బౌలర్లు అంతే కారణమని చెప్పకతప్పదు
వరల్డ్కప్ లో వరస టీం ఇండియా వరస విజయాలకు బ్యాటర్లు ఎంత కారణమో.. బౌలర్లు అంతే. శ్రీలంకంతో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ షమి ఐదు వికెట్లు తీస్తే నేను మాత్రం తక్కువ తిన్నానా అన్నట్లు రవీంద్రా జడేజా సౌతాఫ్రికా జట్టు మీద జరిగిన పోటీలో ఐదు వికెట్లను తీశాడు. సౌతాఫ్రికా బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించడమంటే అంత ఆషామాషీ కాదు. ఈ వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా మంచి పెర్ఫార్మెన్స్ చూపుతుంది. ఆ జట్టు బ్యాటింగ్ పరంగా బలంగా ఉండటం కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ శ్రీలంక తరహాలోనే అతి తక్కువ స్కోరుకు అవుట్ కావడం అంటే దానికి జడేజా కారణమని చెప్పక తప్పదు.
బ్యాటర్లతో పాటు...
నిన్న కోల్కత్తా ఈడెన్ గార్డెన్స్ లో టీం ఇండియా విజయం అభిమానుల్లో ఫుల్లు జోష్ నింపింది. ఈ విజయానికి అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ఒక కారణమైతే.. బౌలర్లలో జడేజా తన స్పిన్ మాయాజాలంతో ఐదు వికెట్లు తీయడం కూడా అలవోకగా విజయాన్ని సాధించి పెట్టింది. విరాట్ కోహ్లి 101 పరుగుల చేసి తన పుట్టిన రోజు అభిమానులకు సెంచరీ కానుకగా ఇస్తే, శ్రేయస్ అయ్యర్ కూడా సూపర్ ఇన్సింగ్స్ ఆడి 326 పరుగులు చేసి సౌతాఫ్రికా జట్టు ముందు అత్యధిక స్కోరు ఉంచగలిగాడు.
ఐదు వికెట్లు తీసి....
తొలుత సిరాజ్ డికాక్ వికెట్ తీయడంతో కొంత సౌతాఫ్రికా జట్టును దెబ్బతీశాడు. మహ్మద్ షమి కూడా రెండు వికెట్లు తీశాడు. ఇక జడేజా విషయానికి వస్తే కీలకమైన సాతాఫ్రికా వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జడేజా కారణంగా కేవలం 27 ఓవర్లలోనే సఫారీల కథ ముగిసేలా చేశాడు. చివరలో కులదీప్ యాదవ్ కూడా రెండు వికెట్లు తీయడంతో ఎండ్ కార్డు పడింది. జడేజా స్పిన్ తో సాతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు కుదురుగా నిలిచేందుకే ఇబ్బంది పడ్డారు. ఎవరూ ఇరవై పరుగులకు మించి చేయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. సౌతాఫ్రికా జట్టులో అత్యధిక స్కోరు చేసింది జాన్సన్ చేసిన పథ్నాలుగు పరుగులు మాత్రమే కావడం గమనార్హం. మిగిలిన ఆటగాళ్లు అతి తక్కువ పరుగులకు అవుటయ్యారు. దీంతో జడేజాపై సర్వత్రా ప్రశంసంలు కురుస్తున్నాయి.
Next Story