Tue Nov 05 2024 19:31:35 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి వరల్డ్ కప్ పండగ
క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈరోజు నుంచి నెల రోజుల వరకూ పండగే. నవంబరు 19 వరకూ వరస మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి
క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈరోజు నుంచి నెల రోజుల వరకూ పండగే. నవంబరు 19వ తేదీ వరకూ వరస మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి. దాదాపు పది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ప్రపంచ మేటి జట్లు ఈ టోర్నీలో పాల్గొనుతుండటంతో ఇండియాకు నేటి నుంచి క్రికెట్ ఫీవర్ అని చెప్పాల్సి ఉంటుంది. ఒక జట్టు మరో జట్టుకు ఏమాత్రం తీసిపోదు. ఏదీ చిన్న జట్టు అని అంచనా వేయడానికి వీలులేదు. మైదానంలో కదలికలను బట్టి గెలుపోటములను నిర్ణయిస్తాయి.
భారత్ వేదికగా...
భారత్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లన్నీ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని క్రికెట్ స్టేడియంలలో జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమై రాత్రి పదకొండు గంటల వరకూ జరగనున్నాయి. యాభై ఓవర్ల మ్యాచ్ కావడంతో అభిమానులు ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. క్రికెట్ స్టేడియాలలో టిక్కెట్లన్నీ బుక్ అయిపోయాయి. ప్రధానంగా భారత్ - పాక్ మ్యాచ్ మధ్య జరగనున్న మ్యాచ్‌లకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. భారత్ ఆడనున్న ప్రతి మ్యాచ్‌కు అభిమానులు తమ సొంత జట్టును గెలిపించుకునేందుకు స్టేడియం వద్దకే పరుగులు తీసే విధంగా పరిస్థితి ఉంది.
బలమైన జట్లు...
బంతి బంతికి టెన్షన్ తప్పదు. ఫోర్, సిక్సర్ షాట్లకు కేరింతలతో స్టేడియాలు మార్మోగిపోతాయి. అన్నీ బలమైన జట్లు కావడంతో మ్యాచ్ విన్నర్ ఎవరనేది చివరి నిమిషం వరకూ చెప్పలేని పరిస్థితి. అందుకే నేటి నుంచి అభిమానులకు పన్నెండు గంటల పాటు నిత్యం స్పెషల్ ఫీస్ట్. తొలి మ్యాచ్ ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ జట్టు ఆడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌తోనే తొలి సమరం ప్రారంభం కానుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ వరల్డ్ కప్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది గంటల్లో సమరానికి సై అనబోతున్నారు. క్రికెట్ ఫ్యాన్స్.. బీ.... రెడీ.
Next Story