Mon Dec 23 2024 10:22:38 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : శ్రీలంకపై గెలిచిన న్యూజిలాండ్ భారీ విజయం.. రన్ రేట్లోనూ
శ్రీలంక - న్యూజిలాండ్ మధ్య పోరు వన్ సైడ్ గానే జరిగింది. న్యూజిలాండ్ శ్రీలంకపై విజయం సాధించింది.
శ్రీలంక - న్యూజిలాండ్ మధ్య పోరు వన్ సైడ్ గానే జరిగింది. ఎప్పటిలాగానే శ్రీలంక తడబడింది. శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం ఇరవై మూడు ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. ఐదు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ కీలక మ్యాచ్ లో విజయం సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే 46.4 ఓవర్లు ఆడిన శ్రీలంక 171 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఒక్క కుశాల్ పెరీరా ఒక్కరే 51 పరుగుల ేచేశాడు. మిగిలిన బ్యాటర్లు తక్కువ పరుగులకే అవుటయ్యారు. కుశాల్ మెండీస్, నిశాంక, సమర విక్రమ, చరిత్ అసలంక తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు.
ఎప్పటిలాగే శ్రీలంక...
128 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన శ్రీలంక కథ అంతటితో ముగిసిందనుకున్నా మహీశ్ తీక్షణ మాత్రం నిలిచి పోరాడాడు. 39 పరుగులు చేసి పరువు నిలబెట్టాడు. ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు, ఫెర్గూసన్ రెండు వికెట్లు, శాంటర్న్ రెండు, రచిన్ రవీంద్ర రెండు, సౌథీ ఒక వికెట్ తీసి శ్రీలంక బ్యాటర్లను చావుదెబ్బతీశారు. దీంతో 171 పరుగులకే లంకేయులు చేతులెత్తేశారు. న్యూజీలాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోవడంతో తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయింది.
న్యూజిలాండ్ బ్యాటర్లు...
ఆ తర్వాత బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు బాగా ఆడారు. డేవిడ్ కాన్వే 45 పరుగులు, రచిన్ రవీంద్ర 42 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు తీయించారు. అనంతరం 86 పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. అయినా నిలకడగా ఆగుతూ డారిల్ మిచెల్, ఫిలిప్స్ మ్యాచ్ ను గెలుపు దిశగా తీసుకెళ్లారు. మిచెల్ కూడా క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఫిలిప్స్, లాథమ్ లు మ్యాచ్ ను గెలిపించారు. రన్ రేటును కూడా సాధించారు. దీంతో రానున్న పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ మ్యాచ్ లపై కూడా ఉత్కంఠ పెరిగింది.
Next Story