Sun Dec 22 2024 21:44:12 GMT+0000 (Coordinated Universal Time)
World Cup : వరుస ఓటములతో అంత కఠిన నిర్ణయమా... ఫ్యాన్స్ ఒత్తిడికి భయపడేనా?
శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారత్ తో పరాజయం తర్వాత క్రికెట్ బోర్డు రద్దయింది
శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారత్ లో ఘోర పరాజయం తర్వాత క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాత్కాలిక కమిటీని నియమించింది. వరల్డ్ కప్ లో శ్రీలంక పేలవమైన ప్రదర్శన చూపింది. సెమీ ఫైనల్ కు కూడా చేరుకోలేకపోయింది. అన్నీ ఓటములే. చిన్న జట్లు అనుకున్న వాటి మీద కూడా విజయం సాధించ లేకపోయింది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
పేలవ ప్రదర్శనతో...
నిజానికి శ్రీలంకకు భారత్ మైదానాలు అన్నీ బాగా తెలిసినవే. పొరుగు దేశమైన శ్రీలంక అనేక సార్లు ఇండియా పిచ్ లపై ఆడింది. ఇటీవలే వరల్డ్ కప్ ముందు కూడా సిరీస్ ను ఆడింది. ఆసియా కప్ లో చెలరేగి ఆడి అన్ని జట్లను ఓడించిన శ్రీలంక జట్టు వరల్డ్ కప్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. ఎంతగా అంటే ఆప్ఘనిస్థాన్ కంటే ఘోరంగా ఆడి ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయిందనే చెప్పాలి. వరల్డ్ కప్ ప్రారంభమైనప్పుడు శ్రీలంక కూడా సెమీ ఫైనల్స్ కు దూసుకు వస్తుందన్న అంచనాలను జట్టు ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయింది. బోర్డును రద్దు చేసి మాజీ క్రికెటర్ అర్జున్ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని నియమించింది.
తాత్కాలిక బోర్డు...
తాజాగా భారత్ తో ఆడిన మ్యాచ్ లో శ్రీలంక జట్టు మరీ బలహీనమైన ప్రదర్శనను కనపర్చింది. జట్టు మొత్తం ఫెయిలయింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 358 పరుగులు చేసింది. ఛేదనలో 55 పరుగులు మాత్రమే చేి ఆల్ అవుట్ అయింది. అంటే 300 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈరోజు బంగ్లాదేశ్ తో మ్యాచ్ ప్రారంభకావడానికి ముందు బోర్డును రద్దు చేయడం విశేషం. పేలవ ప్రదర్శన కారణంగానే శ్రీలంక ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story