Fri Nov 22 2024 19:35:58 GMT+0000 (Coordinated Universal Time)
Rohit sharma : భయ్యా నీకే కాదు.. మాకందరికీ పండగే కదా?
రోహిత్ శర్మ భారత్ ఓపెనర్ గా,కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. రోహిత్ క్రీజులో ఎక్కువ సేపు ఉండాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు.
రోహిత్ శర్మ.. భారత్ ఓపెనర్ గా.. కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. రోహిత్ క్రీజులో ఎక్కువ సేపు ఉండాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. దూకడుగా ఆడుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తాడు. అలాంటి రోహిత్ శర్మకు ఈ వరల్డ్ కప్ ఆఖరిది. ఎందుకంటే క్రికెట్ లో ఎవరైనా మూడు పదులు దాటితేనే రిటైర్మెంట్ కు దగ్గరపడినట్లే. కానీ రోహిత్ ప్రస్తుత వయసు 36 ఏళ్లు. వచ్చే వరల్డ్ కప్ నాటికి నలభై ఏళ్లు. రోహిత్ వచ్చే వరల్డ్ కప్ కు ఆడటం అసంభవం. అవసరం లేదు కూడా. బీసీసీఐ కూడా రోహిత్ శర్మ సేవలను వేరేగా ఉపయోగించుకుంటుంది కానీ, వయసు మీద పడే కొద్దీ పక్కకు తప్పించడానికే ఎక్కువ మొగ్గు చూపుతుంది.
అందరి విషయంలో...
అది రోహిత్ శర్మ ఒక్కరి విషయంలోనే కాదు. ధోనీ లాంటి కూల్ కెప్టెన్ ను వయసు కారణంగానే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారు. బీసీసీఐ నిర్ణయం తీసుకోక ముందే తమంతట తాము అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పడం ఎవరికైనా అలవాటే. అలాంటిది రోహిత్ శర్మకు ప్రత్యేకంగా మినహాయింపు ఏమీ ఉండదు. రేపు విరాట్ కోహ్లి అయినా అంతే. ఫామ్ లో ఉన్నంత వరకే ఎవరికైనా జేజేలు పలుకుతారు. కొంత వెనకబడితే చాలు ఫ్యాన్స్ నుంచే వత్తిడి వస్తుంది. అది క్రికెట్ లో ప్రతి క్రికెటర్ కు ఎదురయ్యే అనుభవమే.
వచ్చే వరల్డ్ కప్ కు...
అందుకే రోహిత్ శర్మ వచ్చే వరల్డ్ కప్ లో ఆడతాడని అనుకోవడం భ్రమే అవుతుంది. అందుకే ఈ వరల్డ్ కప్ ఎలాగైనా ఇండియా పరం చేయాలన్న కసితో ఉన్నాడు. అందుకోసమే టీంతో కలసి శ్రమించి పోరాడుతున్నాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ బ్యాట్ ను ఝుళిపిస్తున్నాడు. కాకుంటే కెప్టెన్ గా క్యాచ్ మిస్ అయినా, అవుట్ అయినా ఫేస్ అదోరకంగా పెడతారన్న విమర్శలు తప్పించి రోహిత్ శర్మను అభిమానించని క్రికెట్ ఫ్యాన్ ఉండరు. మైదానంలో అనుకోకుండా జరిగే తప్పిదాన్ని కూడా రోహిత్ సీరియస్ గా తీసుకుంటాడన్నారు. ఇది టీం స్పిరిట్ ను కొంత దెబ్బతీస్తుందనే వారు కూడా లేకపోలేదు. కానీ ఆ తర్వాత వెనువెంటనే అందరినీ కలుపుకుని పోయే కెప్టెన్ గా కూడా రోహిత్ పేరు గడించాడు.
చికాకు పడినా...
తాను కెప్టెన్సీ గా ఉన్న సమయంలోనే వరల్డ్ కప్ ను భారత్ కు అందించాలని రోహిత్ శర్మ కసితో ఉన్నాడు. లీగ్ మ్యాచ్ లలో తొమ్మిదింటికి తొమ్మిది గెలిచి భారత్ తన సత్తా చాటింది. ఈ వరస గెలుపుల్లో రోహిత్ శర్మ భాగస్వామ్యాన్ని వేరు చేసి చూడలేంద. మరోవైపు ఈ వన్డే వరల్డ్ కప్ లో యాభై సెంచరీ చేయాలని కూడా తహతహలాడుతున్నాడు. హిట్ మ్యాన్ గా రోహిత్ శర్మ అందరి అభిమానాలను దోచుకున్నాడు. వరల్డ్ కప్ ను కూడా సొంతం చేసుకుంటే ఇండియన్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అందుకే అప్పుడప్పుడు చికాకుపడినా రోహిత్ శర్మ మాత్రం సూపర్ కెప్టెన్ అని చెప్పక తప్పదు. ఆల్ ది బెస్ట్ రోహిత్ భయ్యా.
Next Story