Tue Nov 05 2024 14:53:02 GMT+0000 (Coordinated Universal Time)
మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు దాదాపుగా చేతులెత్తేశారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు దాదాపుగా చేతులెత్తేశారు. మూడు ఓవర్లలో మూడు వికెట్లు చేజార్చుకుని భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వరల్డ్ కప్లో భాగంగా చైన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పెద్దగా పరుగులేమీ చేయకుండానే ఆస్ట్రేలియా తన ఇన్నింగ్స్ ను ముగియడంతో భారత్ కు విజయం సులువని అందరూ అంచనా వేశారు. మూడు వికెట్లకు ప్రస్తుతం భారత్ పద్దెనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముగ్గురు ఓపెనర్లు...
కానీ శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు వరసగా అవుట్ కావడంతో భారత్ ఓపెనర్లు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లు స్టార్క్ ఒకటి, హాజల్ వుడ్ రెండు వికెట్లు తీసి భారత్ ను చావు దెబ్బ తీశారు. దీంతో రెండు వందల పరుగులు చేయడం భారత్ కు కష్టంగా మారింది. ఓవర్లున్నా బ్యాటర్లు ఇక లేకపోవడంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు. ప్రస్తుతం క్రీజ్ లో కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లి ఉన్నారు. మరి భారత్ ఆస్ట్రేలియా విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించగలగడం అనుమానంగానే కనిపిస్తుంది.
Next Story