Mon Dec 23 2024 03:19:12 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఇండియా ఫస్ట్ ఫీల్డింగ్
ఇండియా - బంగ్లాదేశ్ వన్డే మ్యాచ్‌లో టాస్ బంగ్లా పరమైంది. తొలుత బంగ్లాదేశ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది.
ఇండియా - బంగ్లాదేశ్ వన్డే మ్యాచ్‌లో టాస్ బంగ్లా పరమైంది. తొలుత బంగ్లాదేశ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఇండియా ఛేజింగ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ స్కోరు చేయకుండా బంగ్లాదేశ్ బ్యాటర్లను కట్టడి చేయడానికి భారత్ బౌలర్లు శ్రమించాల్సి ఉంటుంది. తొలుత భారత్ ఫీల్డింగ్ చేస్తుండటంతో ఛేజింగ్ సులువుగా ఉంటుందన్న అంచనాలు కూడా వినపడుతున్నాయి. మొత్తం మీద బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారీ స్కోరు దిశగా...
మరికాసేపట్లో ఇండియా - బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పూనేలో స్టేడియంకు పెద్దయెత్తున అభిమానులు చేరుకున్నారు. ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగానే ఉన్నాయి. ఈరోజు పూనేలో వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ శాఖ చెప్పడం ఫ్యాన్స్ కు సంతోషం కలిగించే అంశం. ఈ పిచ్ లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు. పూనే స్టేడియంలో ఇండియాకు అనుకూల నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు.
Next Story