Mon Dec 23 2024 10:39:25 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : నలుగురూ నాలుగు హాఫ్ సెంచరీలతో బాదేశారు
ఇండియా - నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తుంది
ఇండియా - నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచున్నారు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా దిగి పరుగుల వరదను పారించారు. ఇద్దరి భాగస్వామ్యం వంద పరుగుల వరకూ ఉంది. దీంతో యాభై పరుగులు చేసిన తర్వాత శుభమన్ గిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. వచ్చిన కాసేపు నిదానంగా ఆడుతున్నప్పటికీ రోహిత్ శర్మ మరో ఎండ్ లో బాదుతున్నాడు.
హాఫ్ సెంచరీ చేసిన తర్వాత...
రోహిత్ శర్మ కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. విరాట్ కోహ్లి 51 పరుగులు చేసిన తర్వాత అవుటయ్యాడు. ముగ్గురు కూడా అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. విరాట్ కోహ్లి అవుట్ కావడంతో క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా తన అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
నెదర్లాండ్స్ కు....
మరోవైపు కేఎల్ రాహుల్ నిదానంగా ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ కూడా 36 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. రాహుల్ కూడా అర్థసెంచరీ చేస్తే వరసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా మరో రికార్డును అధిగమిస్తారు భారత్ ఆటగాళ్లు. ఇలా భారత్ బ్యాటర్లు వరసగా నలుగురు అర్థ సెంచరీలు చేయడం ఈ వరల్డ్ కప్ లో రికార్డు అని చెప్పాలి. భారత్ కు ఇంకా పదకొండు ఓవర్ల వరకూ మిగిలి ఉన్నాయి. ఇప్పటికే 280 పరుగులు చేయడంతో భారత్ 360 పరుగులు దాటే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే నెదర్లాండ్స్ ఛేదనలో నిలదొక్కుకుని నిలిచి గెలవడం కష్టమే. భారత్ కు వరసగా తొమ్మిదో విజయం కూడా ఖాయంగా కనపడుతుంది.
Next Story