Tue Nov 12 2024 22:46:53 GMT+0000 (Coordinated Universal Time)
World Cup Semi Finals 2023 : సెమీ ఫైనల్స్ లో సత్తా చూపుతున్న మనోళ్లు.. భారీ స్కోరు వైపు
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తుంది.
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తుంది. టాస్ గెలిచిన ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా శుభారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ ఎప్పటిలాగానే సిక్సర్సతో విరుచుకుపడ్డాడు. నాలుగు సిక్సర్లు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్ లో శుభమన్ గిల్ నిదానంగా ఆడుతూ రోహిత్ కు ఎక్కువ సేపు బ్యాటింగ్ వచ్చేలా చూశాడు. దీంతో రోహిత్ శర్మ దూకుడుకు మరోసారి న్యూజిలాండ్ బౌలర్లు చిత్తయ్యారు. అయితే 47 పరుగుల వద్ద రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
విరాట్ వచ్చిన తర్వాత...
తర్వాత క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. విరాట్ కోహ్లి వచ్చిన తర్వాత శుభమన్ గిల్ జోరు పెంచాడు. రెండు సిక్సర్లను కొట్టి ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపాడు. అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ఒక ఎండ్ లో గిల్ దూకుడుగా ఆడుతుంటే విరాట్ మాత్రం నిదానంగా తన గేమ్ ను ఎప్పటిలాగానే మొదలుపెట్టాడు. చూసేవారందరికీ జిడ్డు ఆటలా కనిపించినా అది కరెక్టేనంటున్నారు. ఎందుకంటే శుభమన్ గిల్ అప్పటికే పాతుకుపోయి ఉండటంతో గిల్ బాదుడు ఒకవైపు, విరాట్ ఆచితూచి ఆడటం మరొక వైపు జరుగుతున్నాయి. అయితే బ్యాడ్ లక్.. గిల్ కాలి కండరాలు పట్టివేయడంతో రిటైర్డ్ హర్ట్ గా బయటకు వెళ్లిపోయాడు. 79 పరుగులు చేసిన శుభమన్ గిల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగడంతో ఆ స్థానంలో శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.
రిటైర్డ్ హర్ట్ గా...
ఇక శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చిన తర్వాత విరాట్ దూకుడు పెంచాడు. అప్పటి వరకూ కొంత నింపాదిగా ఆడిన రన్ మెషీన్ నెమ్మదిగా వేగం పెంచాడు. అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లి 80 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో శ్రేయస్ అయ్యర్ నిదానంగా ఆడుతూనే సిక్సర్ కొట్టి స్కోరు ను మరింత పెంచాడు. శ్రేయస్ అయ్యర్ 38 పరుగుల వద్ద ఉన్నాడు. టీం ఇండియా ప్రస్తుతం 35 ఓవర్లకు 248 పరుగుల చేసింది. రన్ రేట్ ఎప్పుడూ ఏడుకు తగ్గకుండా మనోళ్లు ఆడటం విశేషం. ఇదే రకంగా మనోళ్లు ఆడితే 400 పరుగులు దాటే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
Next Story