Fri Dec 20 2024 18:04:46 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup : ఆప్ఘనిస్థాన్ సెమీస్ లో ఇలా ఆడిందేంటి?
సెమీ ఫైనల్స్ లో ఆప్ఘనిస్థాన్ బ్యాటర్లు తక్కువ పరుగులకే అవుటయి సౌతాఫ్రికా ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచారు
టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న సెమీ ఫైనల్స్ లో ఆప్ఘనిస్థాన్ బ్యాటర్లు వరసబెట్టి పెవిలియన్ బాట పట్టారు. పూర్తిగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ 11.5 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయి 56 పరుగులు మాత్రమే చేసింది. ఎన్నో అద్భుత విజయాలను సాధించి తొలిసారి వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ కు చేరుకున్న ఆప్ఘనిస్థాన్ జట్టు ఇలా అవసరమైన మ్యాచ్ లో చేతులెత్తేశారు. ఎవరూ పెద్దగా క్రీజులో నిలబడలేకపోయారు. ఈరోజు ట్రినిడాడ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో ఈ రకమైన ప్రదర్శనను ఆప్ఘనిస్థాన్ బ్యాటర్ల నుంచి ఊహించలేదు.
ఆస్ట్రేలియాను ఓడించి...
ఆస్ట్రేలియాను ఓడించి దానిని రేసు నుంచి తప్పించిన జట్టు సెమీ ఫైనల్స్ కు వచ్చేసరికి పూర్తిగా ఇబ్బంది పడింది. ఆప్ఘనిస్థాన్ బ్యాటర్లలో ఒక్క అజ్మతుల్లా మాత్రమే ఎక్కువ పరుగులు చేశాడు. అదీ పది పరుగులు. పది పరుగులు అధికమంటే మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. ఎక్కువ మంది డకౌట్ అయి వెనుదిరగడంతో సౌతాఫ్రికా అతి తక్కువ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. కెప్టెన్ రషీద్ ఖాన్ 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నబీడకౌడ్ అయ్యాడు. నూర్ అహ్మద్ కూడా డకౌట్ అయి వెనుదిరగాడు.
వరసబెట్టి...
ఫరూకీ రెండు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సెన్; షంసీ చెరో మూడు వికెట్లు తీసి ఆప్ఘనిస్థాన్ బ్యాటర్లను ఇంటికి పంపగలిగారు. రబాడా, నోకియా తలో రెండు వికెట్లు తీశారు. దీంతో ఆప్ఘనిస్థాన్ కథ సెమీ ఫైనల్స్ తోనే ముగిసినట్లేనని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా ముందు ఇది పెద్ద లక్ష్యం కాకపోవడంతో సులువుగానే లక్ష్యాన్ని ఛేదించే అవకాశాలున్నాయి. 57 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా ఫైనల్స్ లోకి ప్రవేశించినట్లే. మరి ఆప్ఘనిస్థాన్ సౌతాఫ్రికాను కట్టడి చేస్తుందా? లేదా? చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో?
Next Story