Sun Dec 22 2024 18:58:48 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : ఈ పెద్దోళ్లున్నారే.. టెన్షన్ పెట్టడానికి తప్ప ఎందుకూ పనికి రావడం లేదుగా
టీ 20 వరల్డ్ కప్ లో భారత్ సూపర్ 8లో నూ శుభారంభం చేసింది. ఆప్ఘనిస్థాన్ పై విజయం సాధించింది.
టీ 20 వరల్డ్ కప్ లో భారత్ సూపర్ 8లో నూ శుభారంభం చేసింది. ఆప్ఘనిస్థాన్ పై విజయం సాధించింది. 47 పరుగుల తేడాతో ఆప్ఫనిస్థాన్ పై విజయం సాధించిన భారత్ జట్టు క్రికెట్ ఫ్యాన్స్ కు కొంత ఆనందం కలిగించినా.. అదే సమయంలో ఆందోళన కూడా నెలకొని ఉంది. ఎందుకంటే సీనియర్ ఆటగాళ్లు వరసగా విఫలమవుతుండటం జట్టు పరిస్థిితి చెప్పకనే చెబుతుంది. ఇలాగే ఆడితే ఇక ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ల మీద ఎలా ఆడగలమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఫామ్ లో లేని సీనియర్ ఆటగాళ్లపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిపై ఫ్యాన్స్ గరంగరంగా ఉన్నారు. ఇలాంటి ఆటనా వరల్డ్ కప్ లో చూడాలనుకుంది అంటూ నెట్టింట కామెంట్స్ ను హార్ష్ గా పెడుతున్నారు.
వరస వైఫషల్యాలు...
క్రీడా విశ్లేషకులు సయితం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆటతీరును తప్పపడుతున్నారు. ఆటలో అవుట్ కావడం సహజమే. అయితే ఇలా వరసగా అవుట్ అవుతూ తర్వాత వచ్చే ప్లేయర్లపై వత్తిడి పెంచడమేంటన్న ప్రశ్న వినపడుతుంది. టీ 20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఐపీఎల్ ఇరగదీసిన మనోడు వరల్డ్ కప్ కు వచ్చే సరికి తడబడుతున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటికి నాలుగు మ్యాచ్ లలో విరాట్ పెద్దగా పొడిచింది లేదు. రోహిత్ శర్మ కూడా ఐర్లాండ్ టీం మీద హాఫ్ సెంచరీ చేశాడు తప్పించి తర్వాత చూద్దామన్నా ఆడేందుకు వీలులేదు. వీళ్లిద్దరూ ఓపెనర్లుగా దిగుతూ అందరినీ టెన్షన్ లోకి నెడుతున్నారు. నిన్న జరిగిన ఆప్ఘనిస్థాన్ మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపర్చారు. రోహిత్ శర్మ నాలుగు పరుగులకే అవుటయ్యాడు. విరాట్ కోహ్లి 24 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇద్దరూ క్యాచ్ లు ఇచ్చి పెవిలియన్ బాట పట్టారు.
టాస్ గెలిచి...
టాస్ గెలిచిన భారత్ ముందు బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుట్ కావడతో కోహ్లి కుదురుకున్నాడనిపించింది. కోహ్లి, రిషబ్ పంత్ కొంత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఒక చెత్త షాట్ కొట్టిన విరాట్ 24 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ ఇరవై పరుగులకు వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేలు కొంత హడావిడి చేశారు. శివమ్ దూబే పది పరుగులకు అవుట్ కావడంతో హార్థిక్ పాండ్యా రావడంతో సూర్య, హార్ధిక్ లు కలసి మంచి స్కోరు చేయగలిగారు. సూర్యకుమార్ యాదవ్ 53 పరగులు చేయగా, హఆర్థిక్ 32 పరుగులు చేశారు. ఇరవై ఓవర్లకు భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.
బౌలర్ల వల్లనే...
ఇది ఆప్ఘనిస్థాన్ కు భారీ లక్ష్యమే అనుకోవడానికి వీలులేదు. అయితే ఈసారి కూడా మన బౌలర్లు రాణించారు. ఈ వరల్డ్ కప్ లో బ్యాటర్లకంటే బౌలర్లే అన్ని మ్యాచ్ లలో భారత్ ను ఆదుకుంటున్నారని చెప్పక తప్పదు. జస్ప్రిత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా, అర్హదీప్ మరో మూడు వికెట్లు తీసి ఆప్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చార. కులదీప్ యాదవ్ కూడా రెండు వికెట్లు తీయడంతో ఆప్ఘనిస్థాన్ ఇరవై ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసింది. మొత్తం మీద మన బౌలర్లు మరోసారి విజృంభించి భారత్ కు శుభారంభాన్ని అందచేశారు. ఆప్ఘనిస్థాన్ బ్యాటర్లలో అత్యధికంగా 26 పరుగులు చేసింది ఆజ్మతుల్లా మాత్రమే. మిగిలిన వాళ్లంతా వరసపెట్టి అవుటయ్యారు. దీనిని కూడా బౌలర్ల విజయంగానే చూడాల్సి ఉంటుంది. వచ్చే మ్యాచ్ లలో నైనా సీనియర్ ఆటగాళ్లు బ్యాట్ ఝుళిపించకపోతే..?
Next Story