Mon Dec 23 2024 04:55:12 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : వాళ్ల మీదనే ఆశలు.. త్వరగా వికెట్లు తీస్తేనే గెలుపు ముంగిట నిలిచేది
ఈ టీ 20 వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకెళుతుంది. సూపర్ లోనూ ఇప్పటికే రెండు విజయాలను సాధించింది
ఈ టీ 20 వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకెళుతుంది. సూపర్ లోనూ ఇప్పటికే రెండు విజయాలను సాధించింది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ లను ఓడించి సెమీ ఫైనల్ కు దాదాపు చేరుకుంది. పాయింట్లు మాత్రమే కాదు రన్ రేట్ లోనూ అగ్రస్థానంలో నిలిచింది. అంతకు ముందు లీగ్ మ్యాచ్ లలో వరసగా ఐర్లాండ్, అమెరికా, పాకిస్థాన్ లను ఓడించి సత్తా చాటిన టీం ఇండియా మంచి ఊపు మీద ఉందనే చెప్పాలి. విజయాలతో టీం ఇండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనపడుతుంది. సమిష్టిగా ఆడితే గెలుపు మన ముందు నిలవడం పెద్ద విషయం కాదని ఐదు మ్యాచ్ లలో భారత్ ఆడిన తీరును చూస్తే అర్థమవుతుంది.
నేడు మరో కీలక మ్యాచ్....
అయితే ఈరోజు భారత్ మరొక కీలక మ్యాచ్ ఆడనుంది. ప్రపంచ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. గెలుపు అంత సులువు కాదు. అయినా ఆస్ట్రేలియా పై గెలవడం కష్టమేమీ కాదు. కానీ అందుకు టీం మొత్తం శ్రమించాల్సి ఉంటుంది. టీం ఇండియా చూసేందుకు అన్ని ఫార్మాట్లలో బలంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ లో ఓపెనర్లుగా వచ్చే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లు ఆరంభంలో కొద్దిగా ఇబ్బంది పడినా ఇప్పుుడిప్పుడే ఫామ్ లోకి రావడం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఊరటనిచ్చే అంశంగానే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరూ ఆప్థనిస్థాన్ పై ఎక్కువ పరుగులు చేయడంతో భారత్ 196 పరుగులు స్కోరు చేయగలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సమిష్టిగా రాణిస్తేనే...
రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబేలు కూడా రాణిస్తుండటంతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగానే ఉంది. ఒకరు అవుటయినా మరొకరు వచ్చి బ్యాట్ కు పనిచెబుతున్నారు. అదే సమయంలో బౌలర్లు కూడా రాణిస్తున్నారు. అర్షదీప్ సింగ్, బుమ్రా, హార్థిక్ పాండ్యా, కులదీప్ యాదవ్ ఇలా అందరూ వికెట్లు వెంటవెంటనే తీస్తూ భారత్ కు విజయాలను అందిస్తున్నారు. ఈ మ్యాచ్ లోనూ బౌలర్లు రాణిస్తేనే గెలుపు సులువవుతుంది. ఇప్పటికే ఆప్ఫనిస్థాన్ చేతిలో ఓటమి పాలు కావడంతో కంగారూలు కొంత అయోమయంలో ఉన్నారు. అయితే ఆ జట్టును తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే ఒక్కసారిగా అది పుంజుకునే అవకాశముంది. అందుకే ఈ మ్యాచ్ లో సమిష్టిగా రాణించి విజయం సాధించాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
Next Story