Mon Dec 23 2024 01:00:58 GMT+0000 (Coordinated Universal Time)
World Cup Finals 2023 : ఈరోజు ఇంట్లోనే ఫుడ్.. డెలివరీ కంపెనీల డిస్కౌంట్లు
భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ ను ఇంటి వద్ద ఉండి వీక్షించేందుకు ఎక్కువ మంది సిద్ధమవుతున్నారు
భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ ను ఇంటి వద్ద ఉండి వీక్షించేందుకు ఎక్కువ మంది సిద్ధమవుతున్నారు. అయితే బయట నుంచి ఫుడ్ ఆర్డర్స్ కూడా ఎక్కువగా ఉంటాయని అంచనాలు వినపడుతున్నాయి. కాలు కదపకుండా, కళ్లు ఆర్పకుండా ఉండాలంటే వంటింటి వైపు కూడా వెళ్లకూడదన్న కారణంగా బయట ఫుడ్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అందుకోసమే అనేక ఫుడ్ డెలవరీ కంపెనీలు ఈరోజు ప్రత్యేకంగా డిస్కౌంట్లు కూడా ఇవ్వడం విశేషం.
క్రికెట్ ఫీవర్ ను...
ఇండియా లో వరల్డ్ కప్ ఫీవర్ మామూలుగా లేదు. ఈసారి కప్పు గెలుస్తుందన్న నమ్మకం అందరిలోనూ ఉంది. అందులోనూ ఆదివారం ఫైనల్స్ జరుగుతుండటంతో ఇంటికే పరిమితమవ్వాలని నిర్ణయించుకున్నారు. వారికి కావాల్సిన ఫుడ్ ను డెలివరీ చేసేందుకు హైదరాబాద్ నగరంలోని వివిధ హోటళ్లు ఇప్పటికే రాయితీలను ప్రకటించాయి. అంతేకాదు... స్విగ్గీ వంటి డెలివరీ సంస్థలు కూడా డిస్కౌంట్ను ప్రత్యేకంగా ప్రకటించి తమ బిజినెస్ ను మరింత పెంచుకునే ప్రయత్నంలో పడ్డాయి.
Next Story