Mon Dec 23 2024 03:31:16 GMT+0000 (Coordinated Universal Time)
T 20 World Cup 2024 : టాస్ గెలిచిన భారత్.. ఫస్ట్ ఫీల్డింగ్
టీ 20 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ కు భారత్ సిద్ధమయింది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నారు
టీ 20 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ కు భారత్ సిద్ధమయింది. టాస్ గెలిచిన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడుతున్నారు. న్యూయార్క్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ జట్టులో కెప్టెన్ గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సూర్కకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్పిత్ బుమ్రా, అర్షదీప్ పింగ్ , కులదీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు.
తక్కువ పరుగులకే...
వీరిలో కొందరినే ఈ మ్యాచ్ లో ఆడనిస్తారు. అయితే ఐర్లాండ్ ను కూడా తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. గతంలో అనేక సంచలనాలను సృష్టించిన ఐర్లాండ్ జట్టును సమిష్టిగా రాణించి టీం ఇండియా ఎదుర్కొనాల్సి ఉంటుది. త్వరితగతితన తక్కువ పరుగులకు అవుట్ చేయగలిగితే విజయం మరింత సులువుగా మారనుంది. తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బౌలర్లు ఈ బాధ్యతను తీసుకోవాల్సి ఉ:టుంది.
Next Story