Mon Dec 23 2024 10:48:58 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : బెంగళూరులో తారాజువ్వలా బంతి... ఇంతటి స్కోరు ఈ వరల్డ్ కప్ లో చేయలేదే
ఇండియా - నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసింది
ఇండియా - నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసింది. యాభై ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసింది. భారత్ నుంచి బరిలోకి దిగిన ఐదుగురు బ్యాటర్లు అర్థ సెంచరీలు చేయడం మాత్రం ఈ మ్యాచ్ లో రికార్డు గా చెప్పుకోవాలి. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచున్నారు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా దిగి పంద పరుగులు చేశారు. హాఫ్ సెంచరీ పూర్తయిందనుకుంటున్న సమయంలో శుభమన్ గిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గిల్ క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా పట్టడంతో పెవిలియన్ కు చేరాడు. బెంగళూరు వేదికలో భారత్ దీపావళి రోజు అభిమానుల గుండెల్లో ఆనందాన్ని నింపింది.
నలుగురే అనుకుంటే....
రోహిత్ శర్మ కూడా అంతే. ఈ మ్యాచ్ లో తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రోహిత్ శర్మ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. తర్వాత విరాట్ కోహ్లి కూడా అంతే. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక వెనుదిరిగాడు. సెంచరీ చేస్తాడనుకున్నా నిరాశ పర్చాడు. యాభై ఒక్క పరుగులు చేసి అవుట్ కావడంతో మరో రికార్డుకు మరికొంత దూరంలోనే నిలిచిపోయాడు. తర్వాత క్రీజులో ఉన్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంద పరుగుల భాగస్వామ్యంతో చెలరేగి ఆడారు. శ్రేయస్ అయ్యర్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో వరసగా నలుగురు ఆటగాళ్లు వరసగా హాఫ్ సెంచరీలు చేసుకున్నట్లయింది. శ్రేయస్ అయ్యర్ 123 పరుగులు చేశాడు.
కేఎల్ రాహుల్ కూడా ....
తర్వాత కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇలా ఐదుగురు బ్యాటర్లు అర్థసెంచరీలు చేయడం అంటే ఆషామాషీ కాదు. అందులోఇద్దరు సెంచరీలు చేయడం మంటే మాటలు కాదు.. వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది అరుదైన ఘట్టం. యాభై ఓవర్లకు భారత్ 410 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ లక్ష్యం 411 పరుగులు.కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయింది. దీంతో నెదర్లాండ్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లి ఒక్కడే బౌల్డ్ అయ్యాడు. మిగిలిన ఇద్దరు ఆటగాళ్లు క్యాచ్ లతో వెనుదిరిగాడు. దీంతో భారత్ తొమ్మిదో మ్యాచ్ లోనూ వరసగా విజయం సాధించి పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో టాప్ పొజిషన్ లో నిలిచింది. ఈ నెల 15వ తేదీన ముంబయిలో జరిగే సెమీ ఫైనల్స్లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది.
Next Story