Mon Dec 23 2024 19:07:03 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : ముగ్గురు సెంచరీల మిస్... బ్యాడ్ లక్.. శ్రీలంక లక్ష్యం
ఇండియా భారీ స్కోరు చేసింది. శ్రీలంక ముందు రన్ రేటు కూడా ఎక్కువగా ఉంది
ఇండియా భారీ స్కోరు చేసింది. శ్రీలంక ముందు రన్ రేటు కూడా ఎక్కువగా ఉంది. భారత్ యాభై ఓవర్లకు ఎనిమిది వికెెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. శ్రీలంక లక్ష్యం 358 పరుగులుగా ఉంది. రన్ రేటు ఏడుపైనే ఉంది. భారత్ బ్యాటర్లలో విరాట్ కొహ్లి, శుభమన్ గిల్ లు చెలరేగి ఆడారు. కేవలం నాలుగు పరుగులకే ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ అవుటయినప్పటికీ తర్వాత క్రీజులోకి వచ్చిన కొహ్లి తన సొగసైన షాట్లతో ముంబయి స్టేడియంలో అభిమానులను అలరించారు. శుభమన్ గిల్ కూడా సెంచరీ మిస్ అయ్యాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీకి దగ్గరగా వచ్చి అవుట్ అయ్యాడు. 82 పరుగులు చేసిన అయ్యర్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
శ్రేయస్ అయ్యర్ కూడా...
అయితే సూర్యకుమార్ యాదవ్ పన్నెండు పరుగులకే అవుట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది. యాభై ఓవర్లలో 320 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. శుభమన్ గిల్ 92 పరుగులు వద్ద అవుట్ అయి సెంచరీ మిస్ చేసుకుని నిరాశ పర్చాడు. విరాట్ కొహ్లి కూడా 88 పరుగులు చేసి సెంచరీ చేజార్చుకున్నాడు. క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత స్టేడియం మొత్తం సైలెంట్ అయింది. అయితే కొహ్లి షాట్లతో మళ్లీ స్టేడియంలో హుషారెత్తించాడు.
శ్రీలంక ఎదుట...
శుభమన్ గిల్ నిదానంగా ఆడుతూనే షాట్లు కొడుతూ సెంచరీ దగ్గరకు వచ్చి అవుట్ కావడం గమనార్హం. శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్ లో తనదైన షాట్లతో లంకేయులపై విరుచుకుపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ 82 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఫలితంగా భారత్ శ్రీలంకపై భారీ స్కోరు నమోదు చేసింది. అసలే బలహీనంగా ఉన్న శ్రీలంకకు ఈ స్కోరును ఛేదించడం కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా. మరి ఇక మన బౌలర్లు సత్తా చూపిస్తే ఏడో విజయం భారత్ ఖాయంగానే కనిపిస్తుంది. జడేజా నిలకడగా ఆడుతూ 35 పరుగులు చేశాడు.
Next Story