Sun Mar 30 2025 07:40:01 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : కష్టాల్లో శ్రీలంక వరసగా మూడు వికెట్లు కోల్పోయి
భారత్ - శ్రీలంక మ్యాచ్ ఏకపక్షంగా సాగుతుంది. రెండు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడిపోయిం

భారత్ - శ్రీలంక మ్యాచ్ ఏకపక్షంగా సాగుతుంది. రెండు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఎనిమిది వికెట్లు కోల్పోయిన భారత్ 357 పరుగులు చేసింది. 358 పరుగుల లక్ష్యంతో శ్రీలంక బరిలోకి దిగింది. అయితే ఆదిలోనే శ్రీలంకకు ఎదురు దెబ్బ తగిలింది.
అతి తక్కువ పరుగులు చేసి....
కేవలం రెండు పరుగులు చేసిన శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రాకు ఒక వికెట్, సిరాజ్ కు రెండు వికెట్లు లభించాయి.. ప్రస్తుతం మెండిస్, అసలంక ఆడుతున్నారు. అయితే తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి కేవలం రెండు పరుగులు చేసిన శ్రీలంక ఈ మ్యాచ్ గెలవడం కష్టంగా మారింది. ఆటగాళ్లు క్రీజులో నిలదొక్కుకుంటేనే ఓ మోస్తరు స్కోరు సాధ్యమవుతుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోతే శ్రీలంక ఇక సెమీస్ కు చేరనట్లే. భారత్ మాత్రం అఫిసియల్ గా సెమీస్ కు చేరనుంది.
Next Story