Mon Dec 23 2024 05:03:24 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : నేడు ప్రపంచకప్ లో మరో సూపర్ మ్యాచ్
భారత్ నేడు ఆస్ట్రేలియాతో తలపడనుంది. టీ 20 వరల్డ్ కప్ లో సూపర్ 8 లో తన చివరి మ్యాచ్ ను ఆడనుంది
భారత్ నేడు ఆస్ట్రేలియాతో తలపడనుంది. టీ 20 వరల్డ్ కప్ లో సూపర్ 8 లో తన చివరి మ్యాచ్ ను ఆడనుంది. ఇప్పటికే సూపర్ 8 లో ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లపై గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్ లో భారత్ ఉంది. సెమీ ఫైనల్ కు దాదాపుగా ఖరారు చేసుకున్న భారత్ ఈ మ్యాచ్ లోనూ గెలిచి గ్రూపులో తొలి సారి సెమీ ఫైనల్స్ లో అడుగుపెట్టలని చూస్తుంది.
ఆస్ట్రేలియాను ఓడిస్తే...
మరోవైపు ఆస్ట్రేలియా ఆప్ఘనిస్థాన్ చేతిలో ఓటమితో కసితో ఉంది. భారత్ ను ఓడించి సెమీస ను చేరాలని భావిస్తుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలవడం తప్పనిసరి. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే భారత్ కు ఒకింత బెరుకుగా ఉన్న పరిస్థితుల్లో నేటి మ్యాచ్ ఎలా జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఆస్ట్రేలియాను నేడు ఓడించగలిగితే సెమీస్ కు చేరుకుండానే తమను అనేకసార్లు వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో ఓటమికి ప్రతీకారం భారత్ తీర్చుకున్నట్టవుతుంది.
Next Story