Sun Nov 17 2024 15:53:38 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : విజయం మాత్రం వారిదే.. ఊరికే అలా వచ్చి అవుటయిన వారిది మాత్రం కాదట
భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. ఆరు పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది
నిన్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ చూసిన వాళ్లకు ఎవరికైనా ఇలాంటి జట్టు ఎలా ఈ వరల్డ్ కప్ లో రాణిస్తుందన్న సందేహం తలెత్తక మానదు. చాలా మంది టీవీలు ఆఫ్ చేసుకుని మరీ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతుండటం భారత్ బ్యాటర్ల వంతయింది. ఒక్కరూ సరిగా నిలబడలేదు. విరాట్ కోహ్లి మొదటి మ్యాచ్ లో మాదిరిగానే మళ్లీ వెంటనే వెనుదిరిగాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అనవసర షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి వెళ్లిపోయాడు. దీంతో రిషబ్ పంత్ కొంత నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్ లో అక్షర్ పటేల్ కూడా సిక్సర్, ఫోర్లు కొడుతూ సహకరించారు.
వరసబెట్టి...
సూర్యకుమార్ యాదవ్ కూడా అంతే. ఏడు పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. శివమ్ దూబె మూడు పరుగులకు అవుటయ్యాడు. హార్ధిక్ పాండ్యా కూడా ఏడు పరుగులకు అవుట్ కావడంతో 19 ఓవర్లలోనే అన్ని వికెట్లు కోల్పోయి కేవలం 119 పరుగులు మాత్రమే చేసింది. నిజానికి ఇవి పెద్ద పరుగులు ఏమీ కాదు. అందులో పాకిస్థాన్ కు పెద్ద లక్ష్యమేమీ కాదు. పాక్ గెలుపు లాంఛనమేనని అనుకున్నారంతా. అందుకే నిరాశతో నిట్టూరుస్తూ టీవీలు ఆఫ్ చేసుకున్నారు. పాక్ తో మ్యాచ్ అంటే వీళ్లింతేలే అని చాలా మంది మనసులో అనుకున్నారు కూడా. ఎవరూ భారత్ ఈ మ్యాచ్ గెలుస్తుందని మాత్రం ఊహించను కూడా లేదు.
ఆరు పరుగులు...
కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. ఆరు పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ విజయం బౌలర్లదేనని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 113 పరుగులు మాత్రమే చేసింది. భారత్ బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా తన బౌలింగ్ తో పాక్ ను పరాజయం పాలు చేశాడు. బుమ్రా నాలుగు వికెట్లు తీసి పాక్ ఉసురు తీశాడు. అర్షదీప్ ఒకటి, హార్ధిక్ పాండ్యా రెడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. పాక్ బ్యాటర్లలో రిజ్వాన్ ఒక్కడే 31 అత్యధిక పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లంతా అతితక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో పాక్ పై భారత్ విజయం సాధించి సూపర్ 8 లోకి సునాయాసంగా ప్రవేశించడానికి మార్గం సుగమమయింది.
Next Story