Sat Dec 21 2024 10:56:51 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : ఏజ్ కాదు గేజ్ ముఖ్యం గురూ
భారత్ ఆడిన పది మ్యాచ్ లలోనూ విజయం సాధించింది. తొలి నాలుగు మ్యాచ్లలో బౌలర్ మహ్మద్ షమిని బెంచ్ కే పరిమితం చేశారు.
వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ భారత్ పది మ్యాచ్ లు ఆడింది. పది మ్యాచ్ లలోనూ విజయం సాధించింది. తొలి నాలుగు మ్యాచ్లలో బౌలర్ మహ్మద్ షమిని బెంచ్ కే పరిమితం చేశారు. హార్ధిక్ పాండ్యా ఆల్ రౌండర్ గా ఉండటంతో పాటు శార్దూల్ ఠాకూర్ కు కూడా అవకాశమిచ్చారు. కానీ షమి అనుభవాన్ని తొలి నాలుగు మ్యాచ్లకు ఉపయోగించుకోలేదు. అయినా నాలుగు మ్యాచ్ లలోనూ భారత్ విజయం సాధించింది. అయితే హార్థిక్ పాండ్యా గాయపడటంతో షమికి అనుకోకుండా అవకాశమొచ్చింది.
అనుభవాన్ని జోడించి...
అంతే ఇక షమి తన సత్తా చూపాడు. ఆరు మ్యాచ్ లు మాత్రమే ఆడి 23 వికెట్లు తీశాడు. షమి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బెంచ్ మీద ఉన్న అతడిని మ్యాచ్ లలోకి తీసుకొచ్చారు. షమి ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ వికెట్ తీశారు. నెదర్లాండ్స్ మీద ఐదు వికెట్లు తీసి రికార్డు చెరిపాశడనుకుంటే.. నిన్న జరిగిన సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ మీద ఏడు వికెట్లు తీసి రికార్డును బ్రేక్ చేశాడు. ప్రపంచ కప్ లో ఐదు వికెట్లు తీసిన బౌలర్ గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. నాలుగుసార్లు షమి ఐదు వికెట్లు తీసిన ఘనతను కూడా దక్కించుకున్నాడు.
మరిన్ని రికార్డులను...
ఇక వరల్డ్ కప్ ద్వారా మరిన్ని రికార్డులను షమి తన సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా యాభై వికెట్లు తీసిన బౌలర్ గా కూడా తన పేరు నమోదు చేసుకున్నాడు. భారత్ తరుపున వరల్డ్ కప్ లో 54 వికెట్లు తీసిన బౌలర్ గా కూడా పేరు సంపాదించాడు. షమి బంతి విసిరాడంటే ప్రత్యర్థులకు చెమటలు పడుతున్నాయి. ఇప్పటి వరకూ భారత్ ఆరు మ్యాచ్ లలోనూ విజయం సాధించిందంటే అందుకు షమి కూడా ఒక కారణం. కావాలనుకున్నప్పుడు కీలక వికెట్లు తీసి భారత్ ను ఒడ్డున పడేశాడు మహ్మద్ షమి. వయసుతో సంబంధం లేకుండా వేగంగా బంతులు విసరడం షమి సొంతం. వరల్డ్ కప్ ఫైనల్ లోనూ షమి ప్రత్యర్థి వికెట్లు తీసి భారత్ కు విజయాన్ని అందించాలని కోరుకుందాం.
Next Story