Mon Dec 23 2024 12:22:58 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : ఈ విజయం మాత్రం బౌలర్లదే.. ఇలా ఆడితే చాలుగా బ్రో
టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది.
టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. సునాయాసంగా విక్టరీ కొట్టింది. ఎందుకంటే ఐర్లాండ్ తో ఆషామాషీ కాదు. మంచి హిట్టర్లున్నారు. సంచలనాలకు మారు పేరు ఐర్లాండ్. అలాంటి దేశంతో తొలి మ్యాచ్ ను మనోళ్లు ఎలా ఆడతారోనన్న అనుమానం అందరిలోనూ వ్యక్తమయింది. అయితే ఆ అనుమానాలను పటా పంచలు చేస్తూ టీం ఇండియా ఆటగాళ్లు తొలి మ్యాచ్ లోనే విజృంభించారు. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐర్లాండ్ బ్యాటర్లను మన బౌలర్లు కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. అందుకే అంతటి సులువుగా విజయం లభించింది.
ఏకపక్షంగానే...
మ్యాచ్ తొలి నుంచి ఏకపక్షంగానే సాగింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ జట్టు ఓపెనర్ల నుంచి చివర వరకూ వరసగా పెవిలియన్ బాట పట్టారు. ఒక్కరూ క్రీజులో నిలవలేకపోయారు. మన పేసర్లు కీలక పాత్ర పోషించారు. హార్థిక్ పాండ్యా మూడు, బుమ్రా రెండు, అర్ష్దీప్ రెండు, సిరాజ్ ఒకటి, అక్షర్ పటేట్ ఒక వికెట్ తీయడంతో ఐర్లాండ్ పని అయిపోయింది. ఐర్లాండ్ కేవలం పదహారు ఓవర్లలోనే 96 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇంత తక్కువ స్కోరుకు ఐర్లాండ్ ను అవుట్ చేయడంలో భారత్ బౌలర్లు తమకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా ముగించారు.
వత్తిడి లేకపోవడంతో...
బ్యాటర్లపై వత్తిడిని తగ్గించారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లలో రోహిత్ శర్మ 52 పరుగులు చేశాడు. కేవలం 37 బంతుల్లోనే ఈ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే రిటైర్డ్ హర్ట్ గా వైదొలిగాడు. విరాట్ కోహ్లి మాత్రం నిరాశపర్చాడు. ఒక పరుగుకే అవుటయ్యాడు. పంత్ 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా నిరాశ పర్చాడు. కేవలం రెండు పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో 12.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని అధిగమించింది. వరల్డ్ కప్ లో తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే పంధాను రానున్న మ్యాచ్ లలో కొనసాగించాలని కోరుకుందాం.
Next Story