Fri Dec 20 2024 12:42:53 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup : ఇదే కదా.. కప్ ను తెచ్చిపెట్టింది... ఈ క్యాచ్ కదా.. మనల్ని విశ్వవిజేతలను చేసింది
టీ 20 వరల్డ్ కప్ పదిహేడేళ్ల తర్వాత ఇండియా అందుకుంంది అంటే అందుకు సూర్యకుమార్ అందుకున్న క్యాచ్ అని ఖచ్చితంగా చెప్పాలి.
టీ 20 కప్ లో నిజమైన హీరోలు అనేక మంది ఉన్నారు. కొందరు బ్యాటింగ్ లో చూపగా, మరికొందరు బౌలింగ్ లో చూపారు. అయితే వెళ్లిపోతున్న మ్యాచ్ ను చేతికి అందిపుచ్చుకున్న ఒకే ఒక క్యాచ్.. అదే సూర్యకుమార్ యాదవ్ ఒడిసిపట్టిన క్యాచ్. ఆ క్యాచ్ సూర్య పట్టకపోతే మనకు ఈరోజు వరల్డ్ కప్ దొరికేది కాదు. అందేది కాదు.. నిన్న మ్యాచ్ చూసిన వాళ్లకు ఎవరికైనా ఇదే నిజమనిపిస్తుంది. ఎందుకంటే క్లిష్టమైన సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా బౌండరీ లైన్ వద్ద స్కై పట్టిన క్యాచ్ అద్భుతమనే చెప్పాలి. టీ 20 వరల్డ్ కప్ పదిహేడేళ్ల తర్వాత ఇండియా అందుకుంంది అంటే అందుకు సూర్యకుమార్ అందుకున్న క్యాచ్ అని ఖచ్చితంగా చెప్పాలి.
ఊపిరి బిగబట్టి చూస్తుండగా...
చివరి ఓవర్ అది... ఆ ఓవర్లో దక్షిణాఫ్రికా పదహారు పరుగులు చేయాలి. అదేమీ అంత కష్టం కాదు. ఎందుకంటే దూకుడు మీద అప్పటికే హాఫ్ సెంచరీ చేసిన మిల్లర్ ఉన్నాడు. మిల్లర్ అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తాడని భావించారు. టీం ఇండియా అభిమానులంతా నిరాశలోనే ఉన్నారు. ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. దేవుడా.. అద్భుతం చేసి చూపించి అని కోట్లాది మంది భారతీయుల ప్రార్థనలు నిజమయ్యాయి. దూకుడు మీదున్న మిల్లర్ హార్ధిక్ పాండ్యా వేసిన తొలి బంతిని గాల్లోకి లేపాడు.
ఔరా అనిపించేలా...
నిజానికి అది సిక్సర్ కొట్టాడనుకుని అందరూ ఉసూరుమని నీరసించి పోయారు. కానీ ఆ క్షణంలోనే అద్భుతం జరిగింది. అది వైడ్ లాంగాఫ్ నుంచి చిరుత కంటే వేగంతో వచ్చిన సూర్యకుమార్ ఆ బంతిని పట్టేశాడు. అయితే ఆ వేగాన్ని ఆపుకోలేక బౌండరీ లైన్ దాటేశాడు. కానీ అందుకున్న బంతిని సెకన్ లో గాల్లోకి విసిరేశాడు. తిరిగి వచ్చి ఆ బంతిని పట్టుకుని ఔరా అని అనిపించారు. సిక్సర్ వెళ్లేలా కనిపించిన బంతిని సూర్యకుమార్ అందుకున్న క్యాచ్ టీం ఇండియాకు వరల్డ్ కప్ ను సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.
Next Story