Fri Dec 20 2024 12:06:10 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup : ఇంతకంటే బ్యాడ్ లక్ ఏముంటుంది? చేతికి అందినట్లే అంది చేజారిపోయిందిగా?
టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా ఓటమి పాలయింది
నిన్న జరిగిన టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా ఓటమి పాలయింది. ఇది అత్యంత దురదృష్టకరమైన రోజు దక్షిణాఫ్రికాకు మరెప్పుడూ ఉండకపోవచ్చు. చివరి మూడు ఓవర్ల వరకూ అదృష్టం దాని వైపు ఉంది. కానీ ఎందుకో ఏమో ఒక్కసారిగా టర్న్ అయింది. దక్షిణాఫ్రికా గెలుస్తామని భావించింది. పెద్దగా వేరే ఆలోచన చేయలేదు. ఎందుకంటే... ఏ జట్టు అయినా తక్కువ స్కోరును ఒత్తిడిలేకపోవడంతో ఈజీగా అధిగమిస్తుంది. అందరూ అదే అనుకున్నారు.
పెద్ద రన్ రేట్ లేకపోయినా...
కానీ చివరకు దక్షిణాఫ్రికా ఏడుపరుగులతో ఓటమి పాలయింది. ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. మూడు ఓవర్లలో చేయాల్సింది 25పరుగులే. అంటే ఓవర్ కు ఎనిమిది పరుగులు మాత్రమే. ఇది పెద్ద లెక్క కాదు. కానీ దురదృష్టం వెంటాడింది. ఇప్పటి వరకూ టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్స్ కు చేరని దక్షిణాఫ్రికా జట్టు ఈసారి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. కప్పు కొట్టేసినట్లేనని అనుకుంది. కానీ చూస్తుండగానే మ్యాచ్ చేతి నుంచి చేజారి పోయింది. ఓటమి నుంచి తేరుకోవడానికి ఆ జట్టుకు చాలా రోజుల సమయం పడుతుంది.
Next Story