Fri Dec 20 2024 12:21:57 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup : ధోనీ ఎగ్జయిటింగ్... ట్వీట్.. ఇంతటి విలువైన బహుమతి అంటూ
మహేంద్ర సింగ్ ధోని టీ20 వరల్డ్ కప్ గెలవడంపై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది
క్రికెట్ అభిమానులు మహేంద్ర సింగ్ ధోనిని ఎప్పటికీ మరిచిపోలేరు. 2007లో ధోని సారధ్యంలోనే టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ తర్వాత పదిహేడేళ్లకు ఇది సాధ్యమయింది. అయితే టీం ఇండియా వరల్డ్ కప్ గెలిచిందన్న ఆనందం ప్రపంచంలోని భారతీయులు పండగ చేసుకున్నారు. ఈపండగలో ధోనీ కూడా తానున్నంటూ ఆనందాన్ని పంచుకున్నారు. మహేంద్ర సింగ్ ధోని టీ20 వరల్డ్ కప్ గెలవడంపై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ మనసును దోచుకుంది.
కూల్ కెప్టెన్ గా...
కూల్ కెప్టెన్ గా పేరున్న ధోనీ నిన్నటి మ్యాచ్ లో విజయాన్ని చూసి ఎగ్జయిట్ మెంట్ కు గురయ్యాడు. "వరల్డ్ కప్ 2024 చాంపియన్స్. ఈ మ్యాచ్ సమయంలో నా హార్ట్ రేట్ పెరిగిపోయింది. నిశ్శబ్దంగా ఉంటూనే విజేతగా నిలిచారు. ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంచి కుర్రాళ్ల నుంచి ఫలితం రాబట్టడం అద్భుతం. వరల్డ్ కప్‌ను స్వదేశానికి తీసుకొస్తున్నందుకు ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతాడు. కంగ్రాట్స్ బాయ్స్. పుట్టిన రోజుకు వెల కట్టలేని బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశాడు. థోని జెర్సీ నెంబరు 7వ తేదీ.. మహేంద్రుడి పుట్టిన రోజు జులై 7వ తేదీ. ఇది తన పుట్టిన రోజుకు విలువైన బహుమతి అని మహి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Next Story