Mon Dec 23 2024 11:03:00 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : టాస్ గెలిచిన ఇండియా.. ఫస్ట్ బ్యాటింగ్
ఇండియా - నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
ఇండియా - నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోరును నమోదు చేయడానికే తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. . బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ భారత్ కు పెద్ద లెక్కలోకి రాదు. ఇప్పటికే సెమీస్ ఫైనల్ కు చేరుకుంది. అలాగే నెదర్లాండ్స్ కూడా సెమీ ఫైనల్ నుంచి తప్పుకుంది. ఆ జట్టు గెలిచినా ప్రయోజనం లేదు. ఓడినా ఇంటికే.. గెలిచినా ఇంటికే. అలాగే ఇండియా గెలిచినా సెమీస్‌కే.. ఓడినా సెమీస్ కే.
ఇరు జట్లకు....
కానీ ఈ మ్యాచ్ ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వరసగా తొమ్మిది మ్యాచ్ లను గెలిచి రికార్డును సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంది. విరాట్ కోహ్లి సెంచరీ కోసం ప్రయత్నిస్తాడు. అలాగే భారత్ బ్యాటర్లు కూడా సెంచరీలు చేయాలని తహతహలాడుతున్నారు. మరో వైపు నెదర్లాండ్స్ కూడా సెమీస్ కు చేరకపోయినా ఇండియా మీద గెలిస్తే చాలనుకుంటోంది. అందుకోసం చెమటోడ్చక మానదు. అందుకే ఈ మ్యాచ్ రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరి చివరకు ఎవరిది గెలుపన్నది చూడాల్సి ఉంది.
Next Story