Tue Nov 12 2024 22:56:21 GMT+0000 (Coordinated Universal Time)
World Cup Semi Finals 2023 : ఆ ఇద్దరూ స్టాండ్ అయితే ఇక చాలు.. సెమీస్ లో మనదే సూపర్ విక్టరీ
భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ కు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఫైనల్స్ లో అడుగుపెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు
భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ కు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సెమీ ఫైనల్స్ లో గెలిచి ఫైనల్స్ లో అడుగుపెట్టాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ముంబయి వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వాంఖడే స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కుతుందని గణాంకాలు చెబుతున్నాయి. వాంఖడే స్టేడియంలో మొత్తం 27 వన్డే మ్యాచ్ లు జరగ్గా తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 14 సార్లు విజయం సాధించడం విశేషం. అందుకే టాస్ గెలవడం సెంటిమెంట్ గా ఈ స్టేడియంలో ప్రతి జట్టూ భావిస్తుంది. అలాగని అది కేవలం సెంటిమెంట్ మాత్రమే. క్రికెట్ లో సెంటిమెంట్ కు తావు ఉండదు. టాస్ ఓడిన జట్లు ఈ స్టేడియంలో పదిహేను సార్లు విజయం సాధిస్తే, టాస్ గెలిచిన వాళ్లు కేవలం 12 గెలుపులనే రుచి చూశాయి.
ఓపెనర్లు ఇద్దరూ...
ఇది బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్. టాస్ గెలిచిన వారు ముందు బ్యాటింగ్ తీసుకుంటారు. అందుకే భారత్ ఆ ఇద్దరిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఓపెనర్లుగా శుభమన్ గిల్, రోహిత్ శర్మ రాణిస్తున్నారు. వీరు పది నుంచి పదిహేను ఓవర్లు స్టాండ్ అయితే చాలు భారత్ స్కోరు పైకి ఎగబాకుతుంది. ప్రధానంగా రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ లో అత్యధికంగా సిక్సర్లు కొట్టారు. ఫోర్లతో స్టేడియంలో మోత మోగించాడు. ఫస్ట్ పవర్ ప్లేలోనే 60 నుంచి 70 పరుగులు సాధించి పెట్టారు. మొన్నటి నెదర్లాండ్స్ మ్యాచ్ లో ఓపెనర్ల ఇద్దరి భాగస్వామ్యం వంద పరుగులుగా నమోదయింది. అదే సమయంలో శుభమన్ గిల్ కూడా సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు.
కోహ్లి ఉంటే ధైర్యం...
అందుకే ఫ్యాన్స్ అంతా వీరిద్దరూ కాసేపు క్రీజులో ఉండాలని కోరుకుంటున్నారు. వారెంత సేపు నిలబడితే అంత స్కోరు నమోదవుతుంది. తర్వాత వచ్చే ఆటగాళ్లకు పని సులువుగా మారుతుంది. ఇక తర్వాత రానున్న విరాట్ కోహ్లిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. నెమ్మదిగానైనా పరుగులను అత్యధికంగానే జోడిస్తాడన్న నమ్మకం ఈ వరల్డ్ కప్ ద్వారా మరొకసారి రుజువయింది. రికార్డుల కోసం ప్రయత్నం చేస్తారన్న విమర్శలున్నా ఛేజింగ్ లో కోహ్లిని మించిన ఆటగాడు మరొకడు లేరన్నది అందరూ అంగీకరించే విషయం. అందుకే విరాట్ ఉన్నాడన్న ధైర్యంతోనే ఓపెనర్లిద్దరూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడతారని కూడా అంటారు.
అబ్బురపరుస్తున్న అయ్యర్...
విరాట్ తర్వాత ఈ వరల్డ్ కప్ లో అత్యధికంగా, వేగంగా పరుగులు చేస్తుంది శ్రేయస్ అయ్యర్. అయ్యర్ బౌలర్లపై విరుచుకపడుతున్న తీరు అబ్బుర పరుస్తుంది. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియంను ఒక ఊపు ఊపుతున్నాడు. మొన్నటి నెదర్లాండ్స్ మ్యాచ్ లో సెంచరీ బాదినా, అంతకు ముందు హాఫ్ సెంచరీలు చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా అంతే. కూల్ గా కనిపించినా మెరుపు షాట్లతో ఉరుములా విరుచుకుపడతాడు. ఒకసారి బ్యాట్ చేతికి అంది వచ్చిందంటే కేఎల్ రాహుల్ ను ఆపడం ఎవరి తరమూ కాదు. అందుకే ఈ ఐదుగురు గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. వీరు ఐదుగురు సెమీ ఫైనల్స్ లో సక్సెస్ కావాలని ఇండియన్ ఫ్యాస్ కోరుకుంటున్నారు. ఆకాంక్షిస్తున్నారు.
Next Story