Fri Dec 20 2024 04:28:37 GMT+0000 (Coordinated Universal Time)
World cup : టాస్ గెలిచిన భారత్... ?
మరికాసేపట్లో భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది
మరికాసేపట్లో భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. పిచ్ పేసర్లకు అనుకూలమని క్రీడా నిపుణులు చెబుతున్నారు. దీంతో టాస్ గెలిచిన వారు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంటారని తొలి నుంచి అంచనా వేస్తున్నారు. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయనుంది
ఛేజింగ్ లో...
భారత్, న్యూజిలాండ్ జట్లు బలంగా ఉన్నాయి. రెండు జట్లు వరస విజయాలతో వరల్డ్ కప్లో దూసుకుపోతున్నాయి. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం. దీంతో మ్యాచ్లో ఎవరిది విజయం అన్నది ఉత్కంఠగా మారింది. ఛేజింగ్ చేయడంలో భారత్ కు తిరుగులేకుండా ఉండటంతో ఈ మ్యాచ్ కూడా భారత్ సొంతం కానుందన్న కామెంట్స్ క్రీడా నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్ జట్టును 250 పరుగుల లోపు అవుట్ చేయగలిగితే భారత్ దే విజయం ఖాయమని చెబుతున్నారు.
Next Story