Sun Dec 22 2024 19:28:14 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : ఇలా ఆడితే చాలు... ఇక ఎనిమిదో గెలుపు కూడా మనదే
ఇండియా - సౌతాఫ్రికా మధ్య వరల్డ్ కప్ లో మ్యాచ్ అదిరిపోయింది. భారత్ భారీ స్కోరును దక్షిణాఫ్రికా ముందు ఉంచింది.
ఇండియా - సౌతాఫ్రికా మధ్య వరల్డ్ కప్ లో మ్యాచ్ అదిరిపోయింది. భారత్ భారీ స్కోరును దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఈ మ్యాచ్ లో గెలవాలంటే 327 పరుగులు చేయాల్సి ఉంది. మళ్లీ మన బ్యాటర్లు ఇరగదీశారు. ఒకరు ఫెయిల్ అయినా మరొకరు అందుకుంటూ భారీ స్కోరును సఫారీల ముందు ఉంచారు. 327 పరుగులు సౌతాఫ్రికా చేయాల్సి ఉంది. ఇది ఆషామాషీ కాదు. అంత తేలిక కూడా కాదు.
టాస్ గెలిచి...
టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభాన్ని అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో ఐదు ఓవర్లలో అరవై పరుగులు దాటించి రన్ రేటును పదకొండు వరకూ రోహిత్ చేర్చాడు. అయితే బ్యాడ్ లక్ నలభై పరుగుల వద్ద అవుట్ కావడంతో స్టేడియం మొత్తం సౌండ్ లేకుండా పోయింది. తర్వాత బరిలోకి దిగిన విరాట్ కోహ్లి గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు. 49వ సెంచరీ చేసి రికార్డులకు నేనే రాజునని చెప్పుకనే చెప్పుకున్నాడు. 101 పరుగులు చేసి భారత్ కు భారీ స్కోరు అందించాడు.
లక్ష్య ఛేదనలో...
శుభమన్ గిల్ కూడా అనుకోకుండా అవుట్ కావడంతో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ కూడా చెలరేగిపోయాడు. 70 పరుగులకు పైగానే చేశాడు. కానీ ఏం చేస్తాం. అయ్యర్ కు సెంచరీ అచ్చిరావడం లేదు. ఇప్పుడు కూడా తృటిలో మిస్ అయ్యాడు. తర్వాత వచ్చిన కేెఎల్ రాహుల్ కూడా పెద్దగా పరుగులు చేయకుండానే అవుట్ కావడంతో సూర్యకుమార్ యాదవ్ దిగి 22 పరుగులు, జడేజా 29 పరుగుల స్కోరు బోర్డుకు జోడించాడు. దీంతో 326 పరుగులు యాభై ఓవర్లలో టీం ఇండియా చేయగలిగింది. విరాట్ కొహ్లికి బర్త్డే రోజు ఈడెన్ గార్డెన్స్ సలాం చేసింది.
డికాక్ అవుట్....
తర్వాత ఛేదనలో సౌతాఫ్రికా కొంత సౌతాఫ్రికా నెమ్మదిగా ఆడుతుంది. ఎనిమిది ఓవర్లకు ఇరవై ఒక్క పరుగులు మాత్రమే సౌతాఫ్రికా చేయగలిగింది. సిరాజ్ బౌలింగ్ లో దక్షిణాఫ్రికా కీలక ఆటగాడు డికాక్ అవుటయ్యాడు. ఇది ఆటకు పెద్ద మలుపు అని చెప్పాలి. డికాక్ వరస సెంచరీలతో వరల్డ్ కప్ లో ఒక ఆటాడుకుంటున్నాడు. అలాంటి డికాక్ ను వెంటనే అవుట్ చేసి భారత్ శుభారంభం చేసిందనే చెప్పాలి. డికాక్ కేవలం ఐదు పరుగులకే అవుట్ అయ్యాడు. ప్రస్తుతం వాండర్ హుస్సేన్, బవుమా క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా జట్టు తొలి వికెట్ కల్పోవడంతో భారత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నట్లయింది.
Next Story