Mon Dec 23 2024 11:55:43 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : టాస్ గెలిచిన శ్రీలంక.. తొలుత బ్యాటింగ్ భారత్ దే
భారత్ - శ్రీలంక మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరగబోతోంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారత్ - శ్రీలంక మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరగబోతోంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ముంబయి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ ఏడో విజయంపై కన్నేసింది. శ్రీలంక వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లలోనే గెలిచింది. దీంతో భారత్ కు విజయం సులువేనని క్రీడానిపుణులు చెబుతున్నారు. టీం ఇండియా పెద్దగా మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుంది.
భారీ స్కోరు దిశగా...
తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీం ఇండియా భారీ స్కోరు నమోదు చేసి శ్రీలంకపై ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంది. భారత్ బ్యాటింగ్ పరంగా బలంగా ఉండటంతో భారీ స్కోరు నమోదు చేసే అవకాశముంది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి హోం పిచ్ మీద చెలరేగిపోయే అవకాశాలున్నాయి. శుభమన్ గిల్ కూడా తన సత్తా చూపించే ఛాన్స్ ఉంది. కెఎల్ రాహుల్ ఎటూ ఉండనే ఉన్నాడు. దీంతో భారీ స్కోరు దిశగా టీం ఇండియా ప్రయత్నిస్తుందన్న అంచనాలు వినపడుతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లోకి రావడంతో భారీ స్కోరు చేస్తుందని ఆశిస్తున్నారు.
Next Story