Sun Dec 22 2024 21:27:31 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
వరల్డ్ కప్ లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది
వరల్డ్ కప్ లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేయాల్సి ఉంది. తక్కువ పరుగులకు అవుట్ చేసి... త్వరగా ముగించాలని న్యూజిలాండ్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఒకవేళ శ్రీలంక ఎక్కువ పరుగులు చేసినా ఛేదనాలో దానిని అధిగమిస్తే రన్ రేటులో కూడా తాము మెరుగైన స్థానంలో ఉండి సెమీ ఫైనల్స్ కు చేరతామన్న నమ్మకంతో న్యూజిలాండ్ ఉంది.
అత్యధిక పరుగులు చేసి...
ఈ వరల్డ్ కప్ లో శ్రీలంక పెర్ఫార్మెన్స్ బాగాలేదు. ఆ జట్టు పేలవ ప్రదర్శనతో ప్రభుత్వం శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా రద్దు చేసింది. న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి కూడా అత్యథిక రన్ రేటును సాధిస్తేనే సెమీ ఫైనల్స్ రేసులో ఉంటుంది. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్టు కూడా పోటీ పడుతుండటంతో న్యూజిలాండ్ కు ఈ మ్యాచ్ చావో రేవో కానుంది. అందుకే టాస్ గెలిచిన న్యూజిలాండ్ శ్రీలంకకు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చింది. మరి శ్రీలంక ఎన్ని పరుగులు చేస్తుందన్నది చూడాల్సి ఉంది.
Next Story