Sun Dec 22 2024 21:47:40 GMT+0000 (Coordinated Universal Time)
చిన్న జట్టు అని తేలిగ్గా తీసుకుంటే అంతే
నేడు భారత్ - ఆప్ఘనిస్తాన్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్ లో రోండో మ్యాచ్ను ఇండియా ఆడుతుంది
నేడు భారత్ - ఆప్ఘనిస్తాన్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్ లో రోండో మ్యాచ్ను ఇండియా ఆడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది. పిచ్ మాత్రం బ్యాటింగ్ కు అనుకూలం కావడంతో భారీ పరుగులు ఈ గేమ్ లో కనపడతాయి. టాస్ గెలిచిన ఏ జట్టయినా తొలుత బ్యాటింగ్ తీసుకునే అవకాశముంది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన భారత్ రెండో మ్యాచ్ పసికూన అని ఏమాత్రం ఏమరుపాటుతనం ప్రదర్శించినా మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ప్రతి మ్యాచ్ లో...
ఈ మ్యాచ్ కు కూడా శుభమన్ గిల్ అందుబాటులో ఉండరు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు ఓపెనర్లుగా దిగుతారు. శ్రేయస్ అయ్యర్, విరాట్ కొహ్లి, కెఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా, జడేజా వంటి దిగ్గజ బ్యాటర్లు టీం ఇండియాకు అందుబాటులో ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్లు విఫలం కావడంతో విరాట్ కొహ్లి, కెఎల్ రాహుల్ కలసి జట్టుకు విజయాన్ని అందించారు. అన్ని మ్యాచ్లలో అలా జరుగుతుందని భావించలేం. ఈ మ్యాచ్లో బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా శ్రమించాల్సి ఉంది.
పాక్ తో మ్యాచ్...
ఈ నెల14న పాకిస్థాన్ తో మ్యాచ్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్ గెలిచి మరింత ఉత్సాహంతో టీం ఇండియా పాక్ పై ఆడాల్సి ఉంది. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో జడేజా, కులదీప్ యాదవ్ పైనే భారం ఎక్కువగా ఉండనుంది. ఈ మ్యాచ్లో అశ్విన్ కూడా ఆడే అవకాశాలున్నాయి. ఇప్పటికే పతకాల పట్టికలో తక్కవ రన్ రేట్ తో ఉన్న భారత్ కు ఇది మంచి అవకాశం. భారీ స్కోరు చేస్తే రన్ రేటు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. తొలుత బ్యాటింగ్ చేస్తే భారత్ భారీ స్కోరును, ఛేదనలో అయితే ఓవర్లు ఎక్కువ మిగిలి ఉండగానే ఫినిష్ చేయడం భారత్ ముందున్న లక్ష్యం. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story