Tue Nov 05 2024 19:28:09 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : దాయాది దేశానికి షాక్ కాక మరేంటి? ఇంతటి రన్ రేటా?
సెమీ ఫైనల్స్ కు అడుగు పెట్టాలన్న పాకిస్తాన్ ఆశలు అడుగంటాయి. శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది
వరల్డ్ కప్ లో అంచనాలు ఏవీ నిజం కావడం లేదు. సెమీ ఫైనల్స్ కు అడుగు పెట్టాలన్న పాకిస్తాన్ ఆశలు అడుగంటాయి. శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. 160 పరుగులు మిగిలి ఉండగానే విజయం సాధించడంతో తిరుగులేని విక్టరీని కొట్టేసింది. దీంతో రన్ రేట్ లో తక్కువగా ఉన్న పాకిస్థాన్ కు సెమీఫైనల్స్ కు చేరాలంటే కష్టంతో కూడుకున్న పనే. న్యూజిలాండ్ ప్రస్తుతం పది పాయింట్లలో నాలుగోస్థానానికి చేరిపోయింది. రన్ రేట్ కూడా 0.743కి చేరుకుంది.
రన్ రేటు సాధించడం...
ఆ రన్ రేట్ సాధించాలంటే పాకిస్థాన్ కు కష్టమే. పాకిస్థాన్ కూడా ఇంగ్లండ్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ కూడా ఈ వరల్డ్ కప్ లో పెద్దగా ప్రభావం చూపించకపోవడం, సెమీఫైనల్స్ రేసు నుంచి తప్పుకోవడంతో పాకిస్థాన్ తాము గెలిచి సెమీఫైనల్స్ లోకి అడుగు పెడతామని అనుకుంది. అయితే న్యూజిలాండ్ ఇంత భారీగా విజయాన్ని నమోదు చేయడంతో పాకిస్థాన్ ఆశలు సన్నగిల్లాయి. పాకిస్థాన్ ఇంగ్లండ్ తో ఇంత భారీ విజయాన్ని నమోదు చేయడం కష్టంగానే మారనుందన్న అంచనాలు వినపడుతున్నాయి.
ఇండియా తలపడేది...
ఇంగ్లండ్ ను తక్కువ చేసి చూడటానికి వీలులేదు. ఆ టీంలో కూడా తక్కువ పరుగులకు అవుట్ అయ్యే వారు లేరు. అలాగని రన్ రేట్ విషయంలోనూ పాకిస్థాన్ కు ఆ ఛాన్స్ ఇస్తారన్న నమ్మకం లేదు. అయితే క్రికెట్ కదా? ఏదైనా జరగొచ్చు. ప్రస్తుతానికి అయితే న్యూజిలాండ్ సెమీఫైనల్స్ కు దాదాపు చేరినట్లేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే ముంబయి వాంఖడే స్టేడియంలో భారత్ తో న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్స్ తలపడుతుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Next Story