Mon Dec 23 2024 04:18:30 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : పాక్ మారలేదు... మళ్లీ అదే తడబాటు
పాకిస్థాన్ ఎప్పటిలాగే ఆడింది. భారీ స్కోరు చేస్తుందనుకుంటే వరస వికెట్లు కోల్పోయి భారీ స్కోరేమీ చేయకుండానే ముగించింది
పాకిస్థాన్ ఎప్పటిలాగే ఆడింది. పెద్దగా తేడా లేదు. భారీ స్కోరు చేస్తుందనుకుంటే వరస వికెట్లు కోల్పోయి పెద్దగా స్కోరేమీ చేయకుండానే వెనుదిరిగింది. పాకిస్థాన్ ఈరోజు చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. వరల్డ్ కప్ లో సెమీస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంటుంది. అందులోనూ బలమైన సౌతాఫ్రికా జట్టుపై గెలవాలంటే ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కనీసం మూడు వందలకు పైగా స్కోరు చేస్తేనే దానిని కట్టడి చేసే ఛాన్స్ ఉంటుంది.
సౌతాఫ్రికా లక్ష్యం....
కానీ పాక్ ఆటగాళ్లు ఒక్కొక్కరూ పెవిలియన్ బాట పట్టడం ఆ జట్టు ఫామ్ లో లేని తనాన్ని మరోసారి చూపించింది. కెప్టెన్ బాబర ఆజమ్ మాత్రమే అర్ధసెంచరీ చేశాడు. రిజ్వాన్ కూడా పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయాడు. 31 పరుగులకే వెనుదిరిగాడు. షకీల్ మాత్రం అర్థ సెంచరీ చేయడంతో ఆమాత్రమైనా స్కోరు వచ్చింది. సౌతాఫ్రికా జట్టు మంచి ఫామ్ లో ఉండటంతో ఛేజింగ్ లో పెద్దగా శ్రమ లేకుండానే విజయం సాధించే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే పాక్ కు సెమీ ఫైనల్స్ కు వెళ్లే అర్హత దాదాపు కోల్పోయినట్లే. 45ఓవర్లకు అన్ని వికెట్లు కోల్పోయి 270 పరుగులు మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా లక్షయం 271 పరుగులుగా ఉంది.
Next Story