Mon Dec 23 2024 02:15:19 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్కు
పాకిస్థాన్ జట్టు వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతుంది. జట్టులో అనేక మంది ఆటగాళ్లు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు.
వరల్డ్ కప్ లో అంచనాలకు విజయాలు అందడం లేదు. చిన్న జట్టు కూడా బలమైన జట్టును మట్టికరిపిస్తుంది. మొన్న ఆప్ఘనిస్తాన్ జట్టు ఇంగ్లండ్ ను ఓడిస్తే తాజాగా నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికా జట్టుకు షాకిచ్చింది. ఈ పరిస్థితుల్లో మైదానంలో ఎవరిది పై చేయి అన్నది ముందుగా తేలే పరిస్థితి లేదు. ప్రస్తుతం దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టు వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతుంది. జట్టులో అనేక మంది ఆటగాళ్లు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు జట్టు తెలిపింది. ఈ నెల 20వ తేదీన బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్కు జట్టులో అందరూ అందుబాటులో ఉంటారా? లేదా? అన్న అనుమానం కలుగుతుంది.
బెంగళూరులో ఆస్ట్రేలియాతో...
బెంగళూరుకు చేరుకున్న పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లలో ఎక్కువ మందికి వైరల్ ఫీవర్ సోకిందని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలిపింది. అయితే వీరిలో కొందరు కోలుకున్నారని, మరికొందరు ఇంకా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని పేర్కొంది. ఆస్ట్రేలియాతో సమరం అంటే మామూలు విషయం కాదు. అందుకే జట్టు అంతా పాల్గొనాలన్నది ఆ జట్టు ఫ్యాన్స్ అభిమతం. అయితే ఇందులో కొందరు వైరల్ ఫీవర్ తో దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మొత్తం మీద పాకిస్థాన్ జట్టు వైరల్ ఫీవర్ తో బాధపడుతుండటం కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రాక్టీస్ సెషన్ ను కూడా గంటకు కుదించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Next Story