ఆసుపత్రిలో గిల్.. అప్పటివరకూ కష్టమే..!
2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తొలి మ్యాచ్‌లో గెలిచింది. కానీ భారత జట్టు సమస్యలు తగ్గే సూచనలు కనిపించడం లేదు
2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తొలి మ్యాచ్‌లో గెలిచింది. కానీ భారత జట్టు సమస్యలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. భారత్ టాప్ ఆర్డర్ ముఖ్యమైన సందర్భాల్లో విఫలమవుతుండగా.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జరిగింది. అదే సమయంలో జట్టు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇంకా మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా లేడు. గిల్ డెంగ్యూతో బాధపడుతున్నాడు. అతడి రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉంది. దీంతో ఆయనను చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా గిల్ ఆడే అవకాశాలు చాలా తక్కువ.
టీమ్ ఇండియా ప్రపంచకప్ ప్రారంభానికి ముందు గిల్ ఆరోగ్యం క్షీణించింది. డెంగ్యూ బారిన పడి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. గిల్ రక్తంలో ప్లేట్లెట్స్ లోపం కారణంగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా గిల్ ఆడడం కష్టమేనంటున్నారు.
డెంగ్యూ నుండి కోలుకోవడానికి సాధారణంగా 7-10 రోజులు పడుతుంది. అయితే కోలుకున్న తర్వాత మ్యాచ్‌కు ఫిట్‌గా ఉండటమే గిల్‌కి నిజమైన సవాలు. అయితే అక్టోబర్ 19న జరిగే భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అక్టోబరు 11న అఫ్గానిస్థాన్, అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ల్లో గిల్ ఆడడం కష్టం అంటున్నారు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఇషాన్ కిషన్ రాణించి, టీమ్ ఇండియా విజయం సాధిస్తే గిల్‌కి మళ్లీ ప్లేయింగ్-11లో చోటు దక్కడం కష్టంగా మారే అవకాశం కూడా ఉంది.
పూర్తి ఫిట్నెస్ లేకుండా ప్లేయింగ్ 11లో గిల్‌ని చేర్చి రిస్క్ తీసుకోవడానికి రోహిత్ శర్మ ఇష్టపడడు. ఎందుకంటే.. వన్డే ప్రపంచకప్ సుదీర్ఘమైన టోర్నమెంట్.. తేమతో కూడిన వేడిలో 100 ఓవర్ల మ్యాచ్ ఆడటం ఏ ఆటగాడికి అంత సులభం కాదు.. ముఖ్యంగా డెంగ్యూ నుంచి కోలుకున్న గిల్ వంటి ఆటగాడికి. గిల్ 50 ఓవర్ల ఫీల్డింగ్‌తో సహా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడతాడు. కొన్నిసార్లు 80-90 ఓవర్ల వరకు ఫీల్డ్‌లో ఉంటాడు. దీంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.