Sun Dec 22 2024 18:27:02 GMT+0000 (Coordinated Universal Time)
T20 Worla Cup : ఈజీగా ఫైనల్స్ కు చేరిన సౌతాఫ్రికా
టీ 20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా ఫైనల్స్ కు చేరుకుంది. ఆప్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సులువుగా విజయం సాధించింది.
టీ 20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా ఫైనల్స్ కు చేరుకుంది. ఆప్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సులువుగా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టు కేవలం యాభై ఆరు పరుగులు మాత్రమే చేసింది. ఇది పెద్ద లక్ష్యమేమీ కాకపోవడంతో అప్పుడే సౌతాఫ్రికా జట్టు విక్టరీ తేలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టు ఆల్ అవుట్ అయి కేవలం 56 పరుగులు మాత్రమే చేసింది.
స్వల్ప లక్ష్యాన్ని...
అయితే తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి కేవలం 8.5 ఓవర్లలోనే ముగించింది. ఓపెనర్ డికాక్ డకౌట్ అయినా, హెండ్రిక్స్ 29 పరుగులు, మార్ క్రమ్ 23 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను ఫైనల్స్ కు చేర్చారు. దీంతో ఫైనల్స్ లో 29న సౌతాఫ్రికా తలపడనుంది.
Next Story