Mon Dec 23 2024 00:18:48 GMT+0000 (Coordinated Universal Time)
World Cup Semi Finals 2023 : మిల్లర్ ఒంటరి పోరాటం.. ఆసీస్ ముందు తక్కువ స్కోరు
వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. కీలక బ్యాటర్లందరూ అవుట్ కావడంతో తక్కువ స్కోరు చేసింది.
వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. కీలక బ్యాటర్లందరూ అవుట్ కావడంతో తక్కువ స్కోరు చేసింది. కేవలం 212 పరుగులకు చేసి ఆల్ అవుట్ అయింది. ఆసీస్ లక్ష్యం 213 పరుగులుగా ఉంది. హోరాహోరీ పోరు జరుగుతుందని భావించిన వారికి సఫారీలు నిరాశకు గురి చేశారు. సౌతాఫ్రికా జట్టులో ఒక్క మిల్లర్ మినహా మరెవరూ ఆడలేకపోయారు. కోల్కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న సౌతాఫ్రికా - ఆస్ట్రేలియా సమరంలో సౌతాఫ్రికా వరసగా వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడింది. తక్కువ పరుగులకు నాలుగు వికెట్లు చేసిన సౌతాఫ్రికాను ఆ జట్టు ఆటగాడు మిల్లర్ ఆదుకున్నాడు. మిల్లర్ స్టాండ్ కావడంతోనే సౌతాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. లేకుంటే ఒక దశలో వంద పరుగులకే పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు.
ఒంటరి పోరాటం...
కానీ మిల్లర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. శతకం బాదాడు. సౌతాఫ్రికా కెప్టెన్ బవూమా డకౌట్ అయ్యాడు. డేంజరస్ బ్యాటర్ డీకాక్ కూడా మూడు పరుగులకే అవుట్ కావడంతో ఇక ఆస్ట్రేలియా ఆనందానికి అవుధులు లేవు. ఎనిమిది ఓవర్లకు సౌతాఫ్రికా కేవలం పది పరుగులు చేయడం విశేషం. పవర్ ప్లేలోనే అన్ని ప్రధానమైన వికెట్లను కోల్పోయింది. మార్క్ క్రమ్ పది పరుగులకు, డసెన్ ఆరు పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో సఫారీలు కంగుతిన్నారు. ఇలా ఆసీస్ బౌలర్ల చేతిలో సఫారీలు విలవిలలాడారు.
ఆసీస్ ను కట్టడి చేస్తారా?
నిలదొక్కుకున్నాడనుకున్న క్లాసెన్ 47 పరుగుల వద్ద అవుటయి షాక్ కు గురి చేశాడు. తర్వాత బరిలోకి దిగిన కొయట్టీ కూడా 19 పరుగులకే అవుట్ కావడంతో సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పుడు కేశవ్ మహారాజ్ కూడా అవుట్ అయ్యాడు. మిల్లర్ సిక్సర్ తో సెంచరీ చేసుకుని సౌతాఫ్రికా స్కోరును రెండు వందలు దాటించాడు. వెనువెంటనే అవుట్ కావడంతో స్టాండ్ లో సౌతాఫ్రికా ఫ్యాన్స్ డీలా పడ్డారు. రన్ రేటు ఐదు కూడా లేదు. సెమీ ఫైనల్స్ లో ఇంతటి దారుణంగా ప్రత్యర్థి ముందు తలవంచుతుందని ఆ జట్టు ఊహించి కూడా ఉండదు. అయితే బౌలింగ్ లో ఆసిస్ ను అడ్డుకుంటే విజయాన్ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. మరి ఆసీస్ ను ఏ మేరకు కట్టడి చేయగలుగుతుందో చూడాలి.
Next Story