Mon Nov 18 2024 00:39:25 GMT+0000 (Coordinated Universal Time)
World Cup Finals 2023 : ఇంకా మరిచిపోలేకపోతున్నారు.. షమి జన్మించిన గ్రామానికి కూడా
సెమీ ఫైనల్స్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన మహ్మద్ షమి కి మాత్రమే కాదు ఆయన జన్మించిన గ్రామానికి కూడా దశ తిరిగింది.
వరల్డ్ కప్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై భారత్ అపూర్వ విజయం సాధించిన ఘట్టాన్ని ఇంకా మరచిపోలేకపోతున్నారు. మ్యాచ్ చివర వరకూ ఉత్కంఠ రేపడం.. చివరకు విజయం మనం సొంతం కావడంతో అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి యాభైవ సెంచరీ నమోదు చేసుకున్నా అది అప్పటి వరకే పరిమితమయ్యింది. విరాట్ ను అభినందించిన తర్వాత అందరూ దానిని మర్చిపోయినట్లే కనిపిస్తన్నారు. ఇదే మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీ చేశాడు. వరల్డ్ కప్ లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీ చేసిన అయ్యర్ ను కూడా ఎవరూ గుర్తుపెట్టుకోలేదంటే ఆశ్చర్యం కలగక మానదు.
ఇప్పటి వరకూ...
కానీ మ్యాచ్ లో అందరి మదిలో నిలిచిపోయిన వ్యక్తి మహ్మద్ షమి ఒక్కడే. కష్ట సమయంలో కీలక వికెట్లు తీసి భారత్ విజయాన్ని అందించిన షమిపై నేటికీ ప్రశంసలు కురుస్తున్నాయి. షమి లేకుంటే ఏమయ్యేది అన్న ఆలోచనే అభిమానులను కలవరపరస్తుంది. న్యూజిలాండ్ జట్టును చావుదెబ్బ తీసిన షమిపై అభినందనలు కొనసాగుతున్నాయి. వరల్డ్ కప్ ఫైనల్స్ లోనూ షమి ఇదే తీరును కొనసాగించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆశిస్తున్నారు. ఆకాంక్షిస్తున్నారు. షమికి కేవలం అభినందనలతో సరిపెట్టడమేంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
క్రికెట్ స్టేడియం....
అయితే తాజాగా సెమీ ఫైనల్స్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన మహ్మద్ షమి కి మాత్రమే కాదు ఆయన జన్మించిన గ్రామానికి కూడా దశ తిరిగింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభత్వం ఈ మేరకు షమి సొంత గ్రామంలో క్రికెట్ స్టేడియం నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ అధికారులను ఆదేశించారు. ఉత్తర్ప్రదేశ్ లోని అమ్రోహాలోని సహస్పూర్ గ్రామం షమి సొంత ఊరు. ఈ గ్రామంలో సర్వే నిర్వహించాలని అధికారులను యోగి ఆదిత్యానాధ్ సూచించారు. ఇందుకోసం భారీగా నిధులను ఖర్చు చేయాలని యోచిస్తుంది. ఒక్క సెమీ ఫైనల్స్ కేవలం షమికి మాత్రమే కాదు ఆయన జన్మించిన గ్రామం దశ ను కూడా మార్చింది.
Next Story